Sukumar Rao Bahadur Review: సరికొత్త కథాంశాలతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయేలా విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా ఒక అద్భుతమైన పీరియడ్ హారర్ డ్రామాను సిద్ధం చేశాడు. అదే ‘రావు బహదూర్’. తాజాగా ఈ మూవీని చూసిన సుకుమార్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.
రావు బహదూర్ స్పెషల్ ప్రివ్యూ

సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ మూవీ స్పెషల్ ప్రివ్యూను తాజాగా సుకుమార్ చూశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సినిమాను వీక్షించి, తన అద్భుతమైన రివ్యూను పంచుకున్నాడు.
మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్!
సినిమా చూసిన అనంతరం సుకుమార్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని ఒక విలక్షణమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా అభివర్ణించాడు.
"రావు బహదూర్ ఒక నమ్మశక్యం కాని సినిమా. తెలుగులోనే కాదు ఇండియన్ మూవీస్ లోనే ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇలాంటి జోనర్లో రాలేదు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతోంది" అని సుకుమార్ తన రివ్యూ పంచుకున్నాడు.
అసూయ కలుగుతుందంటూ
ఈ సినిమాలో సత్యదేవ్ నటన, ఆయన క్యారెక్టరైజేషన్ గురించి సుకుమార్ ప్రత్యేకంగా మాట్లాడాడు. "ఒక ఆర్టిస్ట్‌కు ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు. వేరే ఏ ఆర్టిస్ట్ కూడా ఇలా చేయలేడు. ఈ సినిమాలో సత్యదేవ్ చేసిన పాత్రను చూస్తే ఏ నటుడికైనా అసూయ కలుగుతుంది. ‘రావు బహదూర్’ చిత్ర బృందం మొత్తం సత్యదేవ్‌కు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి ఈ సినిమా" అని సుకుమార్ ప్రశంసించాడు.
8 ఏళ్ల తర్వాత
{{/usCountry}}ఈ సినిమాలో సత్యదేవ్ నటన, ఆయన క్యారెక్టరైజేషన్ గురించి సుకుమార్ ప్రత్యేకంగా మాట్లాడాడు. "ఒక ఆర్టిస్ట్‌కు ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు. వేరే ఏ ఆర్టిస్ట్ కూడా ఇలా చేయలేడు. ఈ సినిమాలో సత్యదేవ్ చేసిన పాత్రను చూస్తే ఏ నటుడికైనా అసూయ కలుగుతుంది. ‘రావు బహదూర్’ చిత్ర బృందం మొత్తం సత్యదేవ్‌కు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి ఈ సినిమా" అని సుకుమార్ ప్రశంసించాడు.
8 ఏళ్ల తర్వాత
{{/usCountry}}ఒక భిన్నమైన కథను స్క్రీన్‌పైకి తీసుకువచ్చినందుకు దర్శకుడు వెంకటేష్ మహాపై కూడా సుకుమార్ ప్రశంసలు కురిపించాడు. "కథ రాయడం ఒకెత్తయితే, దాని ఆత్మ కోల్పోకుండా ఇంతటి నమ్మశక్యం కాని శైలిలో ప్రెజెంట్ చేయడం చాలా పెద్ద అచీవ్‌మెంట్. అప్పుడు కేరాఫ్ కంచరపాలెంతో షాక్ ఇచ్చావు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి అదరగొట్టావు’’ అని డైరెక్టర్ గురించి సుకుమార్ చెప్పాడు.
నిర్మాతల ప్యాషన్
సినిమా సాంకేతిక విభాగాల గురించి సుకుమార్ మాట్లాడుతూ.. చిత్రంలో సృష్టించిన ప్రపంచం, కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వర్క్ వేరే లెవెల్‌లో ఉందన్నాడు. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రొడ్యూసర్ అనురాగ్ రెడ్డి సహకారాన్ని కొనియాడాడు. సినిమా చూశాక అనురాగ్ కష్టం, ఆయన ప్యాషన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడికి కనిపిస్తుందని స్పష్టం చేశాడు.
రిలీజ్ డేట్
రావు బహదూర్ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 3న రిలీజ్ కానుంది.