Thimmarajupalli TV: ఈ సంతోషం కోసమే రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాం, ఫలితం ఈరోజు దక్కింది.. డైరెక్టర్ మనిరాజు కామెంట్స్
Director V Muniraju About Thimmarajupalli TV Movie Success: హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. తాజాగా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ మునిరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Director V Muniraju On Thimmarajupalli TV Movie: న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". ఈ మూవీకి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా నటించారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామా
"తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రెస్పాన్స్ అందుకుంటోన్న తిమ్మరాజుపల్లి టీవీ ఘన విజయాన్నిసొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తిమ్మరాజుపల్లి టీవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ నుంచి దర్శకుడు మునిరాజు వరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మూవీ పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నాం
ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ.. "మా "తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ షో, సెకండ్ షోస్ ఫాస్ట్‌గా ఫిల్ అవుతున్నాయి. మా మూవీ పట్ల గర్వంగా ఫీలవుతున్నాం. మీ సపోర్ట్ మరింతగా మా చిత్రానికి అందిస్తారని కోరుకుంటున్నాం" అని అన్నారు.
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ.. "మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకు సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. బీ, సీ సెంటర్స్ నుంచే కాక యూఎస్ నుంచి కూడా మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ చూసిన వాళ్లంతా తమ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయి అంటున్నారు" అని తెలిపారు.
రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాం
"ఈ ఫ్రైడే (ఏప్రిల్ 17) మా టీమ్‌దే అని చెప్పగలను. వీళ్లందరి మొహాలు సంతోషంతో ఎలా వెలుగుతున్నాయో చూస్తున్నారు కదా. ఈ సంతోషం కోసమే రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాం. మేము కోరుకున్న ఫలితం ఈ రోజు దక్కింది" అని తన సంతోషం వ్యక్తం చేశారు డైరెక్టర్ మునిరాజు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ.. "కొత్త వాళ్లం చేసిన మా సినిమాకు హౌస్ ఫుల్స్ కావడం హ్యాపీగా ఉంది. ఊర్ల నుంచి సినిమా చూసిన వాళ్లు ఫోన్ చేసి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం చేసిన ఈ చిత్రంతో ఎలాంటి స్పందన ఆశించామో దాన్ని మించి వస్తోంది" అని చెప్పుకొచ్చారు.
కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్
డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ.. "మా మూవీ చూసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ చేసి సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మా సినిమాకు కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాను హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్" అని పేర్కొన్నారు.
"మా సినిమాకు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మా టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నా" అని హీరో సాయితేజ్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


