Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కితే దిగిపోవడమే మంచిది.. తన విడాకులపై మొదటిసారి స్పందించిన హీరోయిన్ హన్సిక మోత్వానీ
Hansika Motwani About Divorce: బ్యూటిపుల్ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత తొలిసారి స్పందించారు. సోహైల్ ఖతూరియాతో విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, తన నిర్ణయం పట్ల తనకు ఎలాంటి విచారమూ లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు హన్సిక మోత్వానీ.
తెలుగు ప్రేక్షకులకు 'దేశముదురు' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు మార్చి 11న హన్సిక మోత్వానీ, ఆమె భర్త సోహైల్ ఖతూరియాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడిన హన్సిక మోత్వానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై తనదైన శైలిలో స్పందించారు.

"జనానికి క్లిక్‌బైట్ వార్తలు కావాలి, అవి వారికి దొరికాయి. హెడ్ లైన్స్ కావాలనుకున్నారు, అవి కూడా వచ్చాయి. వీటిపై నేను ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు, ఇకముందు కూడా ఇవ్వను. ఎందుకంటే అవన్నీ నాకు అనవసరం" అని హన్సిక మోత్వానీ స్పష్టం చేశారు.
తప్పుడు ప్రయాణం కంటే విడిపోవడమే మేలు
విడాకుల నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాలను పంచుకుంటూ హన్సిక మోత్వానీ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. "మనం ఒకసారి తప్పుడు రైలు ఎక్కామని తెలిశాక, అందులోనే ఉండి బాధపడటం కంటే మధ్యలోనే దిగిపోవడం మంచిది. నా నిర్ణయం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను" అని హన్సిక వివరించారు.
సాధారణంగా సెలబ్రిటీల విడాకుల వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తుంటాయి. కానీ, హన్సిక మాత్రం హుందాగా వ్యవహరిస్తూ, ఏం జరిగిందనేది కేవలం మా ఇద్దరికే తెలుసని, ఆ విషయాలను ప్రైవేటుగా ఉంచడమే అందరికీ శ్రేయస్కరమని పేర్కొన్నారు.
అండగా నిలిచిన కుటుంబం
కష్టకాలంలో తన తల్లి, సోదరుడు కొండంత అండగా నిలిచారని హన్సిక చెప్పుకొచ్చారు. నిరంతరం నవ్వుతూ ఉండే హన్సిక, పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారట. ఆమె సుఖ సంతోషాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వారు ప్రోత్సహించడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోగలిగినట్లు హన్సిక తెలిపారు. విడాకుల తర్వాత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె తన కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు.
గ్రాండ్ వెడ్డింగ్ నుంచి విడాకుల వరకు..
హన్సిక, సోహైల్ ఖతూరియా వివాహం 2022 డిసెంబర్‌లో జైపూర్‌లోని ముండోటా కోటలో అత్యంత వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుక జియో హాట్‌స్టార్ లో హన్సిక లవ్ షాదీ డ్రామాగా ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. ఇంత హంగామా మధ్య జరిగిన పెళ్లి, కేవలం ఏడాదిన్నరలోపే విడాకుల వరకు వెళ్లడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
వృత్తిపరమైన జీవితం
ప్రస్తుతం హన్సిక తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల తమిళ చిత్రం 'గార్డియన్'లో కనిపించిన హన్సిక తెలుగులో 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2' షోకి జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె 'నషా' అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. పర్సనల్ లైఫ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, ప్రొఫెషనల్‌గా మాత్రం మునుపటి కంటే వేగంగా దూసుకుపోవాలని హన్సిక మోత్వానీ నిశ్చయించుకున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


