...
...
Next Story

ఈ సినిమాలో నేను చూపించిన హింస, ప్రేమ చూసి గర్వపడుతున్నాను.. సిగ్గు పడటం లేదు.. ఇది బిగ్గెస్ట్ హిట్: డైరెక్టర్ కామెంట్స్

షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓ రోమియో' (O'Romeo) ఇటీవల విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమా పట్ల తాను గర్వపడుతున్నానని, కచ్చితంగా ఇది తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ ధీమా వ్యక్తం చేయడం విశేషం.

Published on: Feb 19, 2026, 14:54:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన తాజా మూవీ 'ఓ రోమియో' (O'Romeo). షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ లభించాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది.

విమర్శలకు విశాల్ భరద్వాజ్ కౌంటర్..

ఈ సినిమాలో నేను చూపించిన హింస, ప్రేమ చూసి గర్వపడుతున్నాను.. సిగ్గు పడటం లేదు.. ఇది బిగ్గెస్ట్ హిట్: డైరెక్టర్ కామెంట్స్
ఈ సినిమాలో నేను చూపించిన హింస, ప్రేమ చూసి గర్వపడుతున్నాను.. సిగ్గు పడటం లేదు.. ఇది బిగ్గెస్ట్ హిట్: డైరెక్టర్ కామెంట్స్

బాలీవుడ్ మూవీ ‘ఓ రోమియో’పై వస్తున్న విమర్శల గురించి డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ స్పందించాడు. ఈ సినిమా ఇంకా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోనప్పటికీ, ఇది తన కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన సినిమా అవుతుందని అతడు నమ్మకంతో ఉన్నాడు. పీటీఐ (PTI) వార్తా సంస్థతో అతడు మాట్లాడాడు.

"ఈ సినిమాను విమర్శించిన వారి గుండెలు పగిలేలా నేను ఒక విషయం చెప్పాలి. వాళ్ళు ఏమనుకున్నా సరే నా జీవితంలో ఇదే అత్యంత విజయవంతమైన సినిమా కాబోతోంది. ఈ సినిమా తీసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీని గురించి నేను ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సృష్టించిన ఈ హింస, లవ్ స్టోరీ పట్ల నేను గర్విస్తున్నాను" అని ధీమాగా చెప్పడం గమనార్హం.

బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

సాజిద్ నదియాడ్‌వాలా బ్యానర్‌పై నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించింది. ప్రొడ్యూసర్స్ అందించిన అధికారిక లెక్కల ప్రకారం.. 'ఓ రోమియో' బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతోంది.

ఈ సినిమా గత శుక్రవారం (ఓపెనింగ్ డే) రూ. 9.01 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత మొదటి వీకెండ్‌ రెండు రోజుల్లో వరుసగా రూ. 14.50 కోట్లు, రూ. 3.11 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా కొనసాగుతూ.. రూ. 5.10 కోట్లు, రూ. 5.90 కోట్లు, రూ. 3.90 కోట్లుగా ఉన్నాయి. ఇండియాలో ఈ సినిమా దేశీయ మొత్తం కలెక్షన్స్ రూ. 49.41 కోట్లకు చేరింది.

హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా విశాల్ భరద్వాజ్ ఈ సినిమా కథను రాసి, దర్శకత్వం వహించాడు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రితో పాటు నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, దిశా పటానీ, ఫరీదా జలాల్, విక్రాంత్ మాస్సీ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

షాహిద్ కపూర్ 'ఉస్తారా' అనే గ్యాంగ్‌స్టర్‌గా నటించగా, తృప్తి దిమ్రి 'అఫ్షా ఖురేషి' (రాణి శర్మ) పాత్రలో కనిపించింది. అఫ్షాకు ఉస్తారా ఎలా సహాయం చేశాడు అనేదే ఈ కథ. ఈ సినిమా విడుదలకు ముందు ఒక పెద్ద వివాదం తలెత్తింది. రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కూతురు సనోబర్ షేక్ ముంబై కోర్టును ఆశ్రయించింది. తన తండ్రి గురించి సినిమా తీసేటప్పుడు తమ అనుమతి తీసుకోలేదని, పైగా తన తండ్రిని గ్యాంగ్‌స్టర్‌గా తప్పుగా చూపించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ఓ రోమియో' విడుదలను నిలిపివేయాలని కోరింది. అయితే సినిమా విడుదలను ఆపడానికి కోర్టు నిరాకరించడంతో ఈ సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks