Divya Dutta: ఒకేసారి 20 సినిమాలకు సైన్ చేసిన స్టార్ నటి-ఒక్క ప్రశ్నతో కోట్లు వెనక్కి-ఇప్పుడు ఓటీటీ సిరీస్‌తో ట్రెండింగ్
Divya Dutta: ఇప్పుడు ఓటీటీలో చిరాయా వెబ్ సిరీస్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో లీడ్ రోల్ ప్లే చేసిన దివ్య దత్తా ఒకప్పుడు 20 సినిమాలను సైన్ చేసింది. కానీ ఆ ఒక్క ప్రశ్నతో రూ.కోట్లు వెనక్కి ఇచ్చేసిందని తెలుసా?
ఓటీటీలో ఇప్పుడు ట్రెండింగ్ సిరీస్ ‘చిరాయా’. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో దివ్య దత్తా లీడ్ రోల్ ప్లే చేసింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. ఇప్పుడు ఓటీటీ సిరీస్ తో అదరగొడుతున్న దివ్య దత్తా ఒకప్పుడు ఒకేసారి 20 సినిమాలకు సైన్ చేసింది. కానీ ఒక్క ప్రశ్నతో రూ.కోట్లు వెనక్కి ఇచ్చేసింది.
16 ఏళ్ల వయసులోనే
దివ్య దత్తా తన 16 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా' చిత్రంతో ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 1999లో వచ్చిన పంజాబీ చిత్రం 'షహీద్-ఎ-మొహబ్బత్ బూటా సింగ్' ఆమెకు మంచి పేరు తెచ్చింది. కానీ ఆ తర్వాత చాలా కాలం పాటు ఆమెకు సరైన అవకాశాలు లభించలేదు.
వీర్ జారా సినిమా
చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత 'వీర్ జారా' సినిమా దివ్య దత్తాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దివ్య దత్తాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఒక్కసారిగా వచ్చిన క్రేజ్‌తో ఆమె ఏకంగా 20 సినిమాలకు సంతకం చేసేసింది. అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఆమెకు ఇన్ని ఆఫర్లు రావడం పెద్ద విశేషం.
ఆదిత్య చోప్రా సలహా
అయితే ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా వేసిన ప్రశ్న, ఇచ్చిన సలహాతో దివ్య దత్తా కెరీర్ మారిపోయింది. ‘‘ఓ రోజు ఆదిత్య చోప్రాను కలిశా. 20 సినిమాలకు సైన్ చేసినట్లు ఆయనతో గర్వంగా చెప్పా. అయితే ఆదిత్య చోప్రాలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. ‘కేవలం డబ్బు కోసం సినిమాలు చేస్తావా? లేకపోతే లెగసీ వదిలివెళ్తావా?’ అని అడిగారు’’ అని దివ్య దత్తా తెలిపింది.
డబ్బు కాదు
‘‘ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆదిత్య నన్ను అడిగారు. నేను లేదని చెప్పా. మరి మరి ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని ఆయన ప్రశ్నించారు. ‘నువ్వు చాలా మంచి నటివి, కేవలం డబ్బు కోసం కాకుండా గొప్ప పేరు కోసం సినిమాలు చేయ్’ అని చెప్పారు. వెంటనే నేను అప్పటికీ ఇంకా స్టార్ట్ చేయని సినిమాల అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశా’’ అని దివ్య దత్తా పేర్కొంది.
నేషనల్ అవార్డు
ఆదిత్య చోప్రా మాటలు దివ్య దత్తా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. అప్పటి నుంచి మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తోంది. ఈ నిర్ణయం వల్లే ఆమెకు జాతీయ అవార్డు కూడా లభించింది. 2017లో 'ఇరాదా' చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ సహాయ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. 'భాగ్ మిల్ఖా భాగ్', 'బాద్లాపూర్' వంటి చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనకు ప్రశంసలు దక్కాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


