Casting Call: దొంగలు, చిల్లర చిచోరోళ్లు కావలెను.. వెరైటీగా చాయ్ బిస్కెట్ కాస్టింగ్ కాల్.. సినిమా ఛాన్స్.. ఓ లుక్కేయండి

Casting Call: సాధారణంగా సినిమా కాస్టింగ్ కాల్ ఎలా ఉంటుంది? మా సినిమా కోసం ఈ వయసు, ఇలాంటి క్యారెక్టర్ కు నటులు కావాలెను అని ప్రకటిస్తారు. కానీ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కాస్టింగ్ కాల్ మాత్రం చాలా వెరైటీగా ఉంది. దొంగలు, చిచోరోళ్లు అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. 

Published on: Apr 1, 2026, 11:18:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారా? ఒక్కసారి బిగ్ స్క్రీన్ పై కనబడాలన్నది మీ కలనా? అయితే ఈ అవకాశం మీ కోసమే. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ స్థాయికి ఎదిగిన చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి కాస్టింగ్ కాల్ వచ్చింది. ఈ కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ ను చాయ్ బిస్కెట్ వెరైటీగా అనౌన్స్ చేయడం విశేషం.

కాస్టింగ్ కాల్ (instagram-chaibisketfilms)
కాస్టింగ్ కాల్ (instagram-chaibisketfilms)

కాస్టింగ్ కాల్

సాధారణంగా కాస్టింగ్ కాల్ అంటే సినిమాల్లో ఆర్టిస్టులు కావలెను, నటీ నటులు కావలెను అనే ప్రకటనలు వస్తాయి. ఏ క్యారెక్టర్, ఏ ఏజ్ అంత అనేది చెప్తారు. కానీ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మాత్రం వెరైటీగా కాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చింది.

దొంగలు

‘‘ల*గలు, దొంగలు, చిల్లర చిచోరోళ్ల లెక్క కనబడేటోళ్లు మాకు కావాలె’’ అనే పోస్టర్ తో చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. 55 నుంచి 70 ఏళ్ల పురుషుడు, మహిళ, 25 నుంచి 30 ఏళ్ల తెలుగమ్మాయి, 18 నుంచి 50 ఏళ్ల యూనిక్ లుకింగ్ క్యారెక్టర్లు కావాలెను అని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ప్రకటించింది.

టాలెంటెడ్

‘‘మీ గ్యాంగ్ లోని టాలెంటెడ్ చిచోరెగాళ్లను ట్యాగ్ చేయండి. ఈ మాటలను చెప్పండి. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నంబర్ 6 కోసం ఇదే కాస్టింగ్ కాల్’’ అని చాయ్ బిస్కెట్ క్యాప్షన్ ఇచ్చింది. కచ్చితంగా తెలంగాణ యాస మాట్లాడాలని పేర్కొంది.

ఇంకోటి కూడా

అంతకుముందు మార్చి 23న మరో కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చింది చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్. లీడ్ క్యారెక్టర్ (19-25 ఏళ్లు), కీ రోల్స్ (35-55 ఏళ్లు), టీన్స్ (13-19) ఏళ్లు కావాలని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఇన్ స్టాలో పోస్టు చేసింది.

ఈ సినిమాలు

ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తో చాయ్ బిస్కెట్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత మూవీ ప్రొడక్షన్ లోకి చాయ్ బిస్కెట్ కంపెనీ అడుగుపెట్టింది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పేరుతో ‘బాయ్స్ హాస్టల్’, ‘మేం ఫేమస్’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘మేజర్’ సినిమాల నిర్మాణంలో భాగమైంది. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఇందుకోసం కొత్త నటీనటులకు బంపర్ ఛాన్స్ ఇస్తోంది చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More