Don't Trouble the Trouble: బాలయ్య బాబు వాయిస్ ఓవర్‌.. ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రైలర్ చూశారా?

Don't Trouble the Trouble: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఇది వినగానే బాలయ్య బాబు పాపులర్ డైలాగే గుర్తుకొస్తుంది. ఇప్పుడిదే టైటిల్ తో ఫహాద్ ఫాజిల్ నటించిన మూవీ రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

Published on: Sep 22, 2026, 19:23:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Don't Trouble the Trouble: మలయాళ వెర్సటైల్ యాక్టర్, 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' నుంచి వినోదాత్మక థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామాకు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ట్రైలర్‌కి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇచ్చిన వాయిస్ ఓవర్ మెయిన్ హైలైట్‌గా నిలిచింది.

Don't Trouble the Trouble: బాలయ్య బాబు వాయిస్ ఓవర్‌.. ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రైలర్ చూశారా?
Don't Trouble the Trouble: బాలయ్య బాబు వాయిస్ ఓవర్‌.. ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రైలర్ చూశారా?

ఇప్పటికే 'పుష్ప', 'ఆవేశం' లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కి బాగా దగ్గరైన ఫహాద్ ఫాజిల్.. ఈసారి నేరుగా స్ట్రెయిట్ తెలుగు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ పాపులర్ డైలాగునే టైటిల్ గా ఈ సినిమాను తీసుకొస్తుండటం మరో విశేషం.

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కథేంటి? ట్రైలర్‌లో ఏం చూపించారంటే?

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ 'సూరి' అనే ఒక మెజీషియన్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ఎప్పుడు చూసినా డబ్బు వెనకాల పడే సూరి.. ఆ డబ్బు పిచ్చి వల్ల రకరకాల ప్రమాదాల్లో పడుతుంటాడు. అలాంటి టైమ్‌లో అతనికి ఒక చిన్న పాప (సారా) పరిచయమవుతుంది. ఆ పాపను తనతో పాటు తీసుకెళ్తే కాస్త డబ్బు సంపాదించవచ్చని సూరి ప్లాన్ వేస్తాడు.

కానీ ఆ పాప వల్ల తన జీవితంలోకి ఎలాంటి ఊహించని తుఫాను రాబోతుందో సూరికి ముందే తెలియదు. తీరా తీసుకెళ్లాక ఆ పాప సాధారణమైన పిల్ల కాదని, ఆమె దగ్గర కొన్ని విచిత్రమైన మేజికల్, సూపర్ పవర్స్ ఉన్నాయని తెలిసి సూరి మైండ్ బ్లాక్ అవుతుంది.

ఈ ట్రైలర్ లో హైలైట్ ఏంటంటే బాలయ్య బాబు వాయిస్ ఓవర్. తన పాపులర్ డైలాగును తనతోనే ఇందులో చెప్పించడం విశేషం. సూరి పాత్ర గురించి చెప్పిన తీరు ఆకట్టుకునేలా ఉంది.

ఫాంటసీ వినోదం.. ఆకట్టుకుంటున్న కామెడీ

ఆరంభంలో ఆ పాప రాకతో సూరికి పెద్ద పెద్ద చిక్కులు ఎదురైనప్పటికీ, ఆ తర్వాత ఆ చిన్నారే అతనికి రక్షణగా నిలుస్తుంది. అతని సమస్యలన్నింటినీ తన శక్తులతో ఎలా పరిష్కరించిందో ట్రైలర్‌లో చాలా ఫన్నీగా చూపించారు. ఫాంటసీ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని మలిచారు.

ఫహాద్ ఫాజిల్ తన మార్క్ టైమింగ్, సెటైరికల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించారు. పాప పాత్రలో నటించిన సారా తన క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. బాలయ్య గొంతుతో వచ్చిన వాయిస్ ఓవర్ సినిమా కాన్సెప్ట్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.

రాజమౌళి సమర్పణలో.. బిగ్ ప్రొడక్షన్ వాల్యూస్

'బాహుబలి' లాంటి గ్లోబల్ వండర్‌ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ (షోయింగ్ బిజినెస్) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మ్యూజిక్ సెన్సేషన్ కాల భైరవ అందిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ తరహా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ మోస్ట్ అవైటెడ్ కామెడీ ఫాంటసీ డ్రామా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More