Don’t Trouble The Trouble Teaser: బాలయ్య బాబు డైలాగే టైటిల్.. రాజమౌళి సమర్పణ.. అదిరిన ఫహద్ ఫాజిల్ తెలుగు మూవీ టీజర్

Don’t Trouble The Trouble Teaser: మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటిస్తున్న తెలుగు మూవీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది. బాలకృష్ణ ఫేమస్ డైలాగే టైటిల్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది.

Published on: Jul 13, 2026, 13:04:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Don’t Trouble The Trouble Teaser: మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న సరికొత్త మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ విడుదలైంది. బాలకృష్ణ నటించిన శ్రీమన్నారయణ మూవీలోని పాపులర్ డైలాగే టైటిల్ గా వస్తున్న సినిమా ఇది. గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ క్రేజీ ఫాంటసీ డ్రామా టీజర్ విశేషాలు, ఆసక్తికర కథాంశం, విడుదల తేదీ వివరాలు మీకోసం.

Don’t Trouble The Trouble Teaser: బాలయ్య బాబు డైలాగే టైటిల్.. రాజమౌళి సమర్పణ.. అదిరిన ఫహద్ ఫాజిల్ తెలుగు మూవీ టీజర్
Don’t Trouble The Trouble Teaser: బాలయ్య బాబు డైలాగే టైటిల్.. రాజమౌళి సమర్పణ.. అదిరిన ఫహద్ ఫాజిల్ తెలుగు మూవీ టీజర్

ఆకట్టుకుంటున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్

ఆ మధ్య పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్‌గా తన విశ్వరూపం చూపించిన మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil).. ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఆయన హీరోగా నటిస్తున్న మొదటి స్ట్రెయిట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. 2024 మార్చిలో అధికారికంగా ప్రకటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా మేకర్స్ మోస్ట్ అవేటెడ్ టీజర్‌ను విడుదల చేశారు. సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

దయ్యమా? పాపా? అసలు కథేంటి?

ఈ సినిమాకు కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ కథలో ఫహద్ ఫాజిల్ 'సూరి' అనే పాత్రలో కనిపిస్తుండగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా 'దివ్య' అనే ఒక అల్లరి పిల్ల పాత్రలో నటించింది. వీరిద్దరి చుట్టూనే ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది.

హైదరాబాద్ నగరంలో ఉండే సూరి జీవితంలోకి దివ్య అనుకోకుండా ప్రవేశిస్తుంది. అయితే ఆ చిన్నారికి కొన్ని వింతైన, రహస్యమైన శక్తులు ఉన్నాయని సూరి గమనిస్తాడు. దాంతో ఆమె సాధారణ మనిషి కాదు, ఒక దయ్యం అని సూరి బలంగా నమ్ముతాడు. అసలు దివ్య నిజంగానే దయ్యమా? లేదా మరేదైనా మాయా శక్తా? ఆమె అసలు సూరి జీవితంలోకి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమాను వెండితెరపైనే చూడాల్సిందే.

ఫహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన విజువల్స్

టీజర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచబోతున్నట్లు స్పష్టమవుతోంది. హీరోగా ఫహద్ ఫాజిల్ తనదైన హావభావాలు, కామెడీ టైమింగ్, నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు హ్యూమర్, థ్రిల్లింగ్ అంశాలు, ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.

చిన్నారి సారా కూడా తన క్యూట్ లుక్స్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫాంటసీ ప్రపంచాన్ని విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.

రాజమౌళి సమర్పణలో.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ భారీ ప్రాజెక్ట్‌ను 'బాహుబలి' వంటి దృశ్యకావ్యాలను అందించిన ఆర్కా మీడియా వర్క్స్ (Shobu Yarlagadda, Prasad Devineni), షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ టీజర్ విడుదలతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫహద్ ఫాజిల్ నుంచి వస్తున్న ఈ మొదటి తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More