Varanasi Motion Picture: రాజమౌళి 'వారణాసి'లో మైండ్ బ్లాక్ చేసే మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్.. ఆ 20 నిమిషాల సీన్ ఏంటంటే?

Varanasi Motion Picture: రాజమౌళి వారణాసి మూవీ గురించి రోజుకో కొత్త విశేషం బయటకు వస్తూనే ఉంది. ఈ సినిమా గురించి తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. ఇందులో 20 నిమిషాల పాటు మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ ఉందని చెప్పాడు.

Published on: Jul 2, 2026, 21:57:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Varanasi Motion Picture: ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ 'వారణాసి' గురించి ఒక మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక భారీ 20 నిమిషాల మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ ఉండబోతోందని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్‌గా రివీల్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ రేంజ్ స్కేల్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడటం ఇదే ఫస్ట్ టైమ్.

Varanasi Motion Picture: రాజమౌళి 'వారణాసి'లో మైండ్ బ్లాక్ చేసే మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్.. ఆ 20 నిమిషాల సీన్ ఏంటంటే?
Varanasi Motion Picture: రాజమౌళి 'వారణాసి'లో మైండ్ బ్లాక్ చేసే మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్.. ఆ 20 నిమిషాల సీన్ ఏంటంటే?

మరింత పెరిగిన హైప్

టెక్నాలజీ వాడకంలో రాజమౌళి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఈ 20 నిమిషాల ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని వరల్డ్ క్లాస్ 'A&M MoCap' ఫెసిలిటీలో చాలా రోజులు కష్టపడి షూట్ చేశారు.

విజువల్‌గా చాలా అద్భుతంగా ఉండబోయే ఈ సీక్వెన్స్ షూటింగ్ టైమ్‌లో మహేష్ డెడికేషన్ చూసి తాను షాక్ అయ్యానని పృథ్వీరాజ్ చెప్పాడు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో వారణాసి సినిమాపై హైప్ అమాంతం హాలీవుడ్ లెవెల్‌కు వెళ్లిపోయింది.

రూ. 1400 కోట్ల బడ్జెట్.. రామాయణం కనెక్షన్

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని ఏకంగా రూ. 1400 కోట్ల కళ్లు చెదిరే బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదొక టైమ్-ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇందులో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కొన్ని మైథలాజికల్ సీన్స్‌లో సాక్షాత్తు శ్రీరాముడిగా కూడా కనిపించబోతున్నాడు. విలన్ గా చేస్తున్న పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు 'కుంభ'. వీల్ చైర్ లో ఉండే ఆ పాత్ర రామాయణంలోని కుంభకర్ణుడిని పోలి ఉంటుందట.

బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత 'మందాకిని' క్యారెక్టర్‌తో మళ్లీ ఇండియన్ స్క్రీన్‌కు కమ్‌బ్యాక్ ఇస్తోంది. ఈ సినిమాలో అంటార్కిటికా మంచు పర్వతాలు, నాచురల్ డిజాస్టర్స్, రామాయణ రిఫరెన్స్ లాంటి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని రాజమౌళి రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో జరిగిన ఈవెంట్‌లో కన్ఫర్మ్ చేశాడు. రామాయణ బ్యాక్‌డ్రాప్‌లో సుమారు 50,000 వానర సైన్యంతో ఓ భారీ యుద్ధ సన్నివేశం కూడా ఉండబోతోందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది.

ఏప్రిల్ 2027లో గ్లోబల్ రిలీజ్

వారణాసి మూవీకి సంబంధించిన మేజర్ ఐమాక్స్ (IMAX) యాక్షన్ బ్లాక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయని, ఇంకా కేవలం 80 రోజుల ప్యాచ్ వర్క్, డ్రామా పోర్షన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని రాజమౌళి ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు.

ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈ ప్రాజెక్ట్‌కు బిగ్గెస్ట్ అసెట్స్. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఏడాదికి పైగా టైమ్ తీసుకుని ఏప్రిల్ 7, 2027న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకురాబోతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More