...
...
Next Story

Dorothy Jeeva: ట్రాన్స్‌జెండ‌ర్‌ అని ఇంట్లో నుంచి గెంటేశారు-డోర‌తీ మూవీతో జీవిత‌మే మారిపోయింది: నటి జీవా సుబ్ర‌హ్మ‌ణ్యం

Dorothy Jeeva subramaniam: తమిళంలో వచ్చిన డోరతీ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పెద్ద వివాదమే నడిచింది. అయితే ఈ చిత్రంలో నటించిన జీవా సుబ్రహ్మణ్యం పెట్టిన లేటెస్ట్ ఎమోషనల్ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ట్రాన్స్‌జెండ‌ర్‌ అయిన తన జీవితం డోరతీతో ఎలా మారిందో ఆమె చెప్పుకొచ్చింది.

Published on: Nov 11, 2026, 09:54:44 IST
Advertisement

Dorothy Jeeva subramaniam: కొన్ని సినిమాలు ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తాయి. కొన్ని మూవీస్ మెసేజ్ ను అందిస్తాయి. కానీ కొన్ని మాత్రం ఆ సినిమాలో నటించిన నటీనటుల జీవితాలను మార్చేస్తాయి. ఇప్పుడు డోరతీ మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీలో నటించిన ట్రాన్స్‌జెండ‌ర్‌ జీవా సుబ్రహ్మణ్యం కథ కూడా అలాంటిదే.

దీపావళి వెలుగులు

ట్రాన్స్‌జెండ‌ర్‌ అని ఇంట్లో నుంచి గెంటేశారు-డోర‌తీ మూవీతో జీవిత‌మే మారిపోయింది: నటి జీవా సుబ్ర‌హ్మ‌ణ్యం
ట్రాన్స్‌జెండ‌ర్‌ అని ఇంట్లో నుంచి గెంటేశారు-డోర‌తీ మూవీతో జీవిత‌మే మారిపోయింది: నటి జీవా సుబ్ర‌హ్మ‌ణ్యం

ట్రాన్స్‌జెండ‌ర్‌ జీవా సుబ్రహ్మణ్యం ‘డోరతీ’ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాతో తన జీవితమే మారిపోయిందని జీవా ఎమోషనల్ అయింది. తన లైఫ్ లోకి వెలుగులు వచ్చాయని దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

ఇంట్లో నుంచి గెంటేశారు

కుటుంబాన్ని ఎదురించి నిలబడిన ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ కథతో తెరకెక్కిన మూవీ ‘డోరతీ’. ఈ సినిమా తన జీవితాన్ని ఎలా మార్చిందో జీవా చెప్పుకొచ్చింది. ‘‘నాకు ఇంకా ఊహ తెలియని వయసులో, నాకు నేనే పూర్తిగా అర్థం కాని సమయంలో దీపావళికి నాలుగు రోజుల ముందు నేను ట్రాన్స్‌జెండ‌ర్‌ అని ఇంటి నుంచి గెంటేశారు. అప్పటి నుంచే దీపావళి అంటే నాకు నచ్చేది కాదు.

ప్రతి ఏడాది దీపావళి పండగ సమయంలో నాలుగు రోజులు అసలు బయటకే వెళ్లేదాన్ని కాదు. తలుపులు వేసుకొని, చీకటి గదిలో ఒంటరిగా ఉండిపోయేదాన్ని. కానీ ఈ ఏడాది నా జీవితం పూర్తిగా మారిపోయింది’’ అని జీవా తెలిపింది.

జీవితం మారిపోయింది

‘‘డోరతీ మూవీ కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి నా పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు వచ్చాయి. ఇలాంటి ప్రేమను ఎప్పుడూ చూడలేదు. గతంలో నా బర్త్ డే కూడా చేసుకోలేదు. కానీ ఈ సారి నేనే వెళ్లి కేక్ తెచ్చుకొని కట్ చేశా. అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా బాధలు అనుభవించిన నాకు మీ అందరి ప్రేమతో ప్రశాంతత దొరికింది’’ అని జీవా ఎమోషనల్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks