Drishyam 3 Telugu: దృశ్యం 3 మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. మద్రాస్ హైకోర్టు స్టే కొనసాగుతున్న ప్రస్తుతం మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.
తెలుగులో దృశ్యం 3 స్ట్రీమింగ్

జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్‌లాల్, మీనా నటించిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ దృశ్యం 3. గత నెలలో థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది. గతంలో వచ్చిన రెండు మూవీస్ తో పోలిస్తే.. మూడో భాగానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాగానే వసూలు చేసింది.
ఇక ఈ సినిమా గురువారం (జూన్ 18) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మద్రాస్ హైకోర్టు స్టే కారణంగా తెలుగు వెర్షన్ మినహాయించి ఒరిజినల్ మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ మరుసటి రోజే తెలుగు వెర్షన్ ను కూడా ప్రైమ్ వీడియో యాడ్ చేయడం విశేషం. ఆడియోలో తెలుగును కూడా చేర్చడం చూడొచ్చు.
అసలు ఏం జరిగింది?
'దృశ్యం' మొదటి భాగాన్ని తెలుగులో వెంకటేష్, మీనా లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శ్రీప్రియ (Sripriya) రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'దృశ్యం 3' తెలుగు హక్కులు తమకే చెందుతాయంటూ శ్రీప్రియ, ఆమె నిర్మాణ సంస్థ 'రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్' మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సినిమాను తెలుగు భాషలో రిలీజ్ చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ శ్రీప్రియ, రాజ్ కుమార్ సేతుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలియకుండా, తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేయడం చట్టవిరుద్ధమని వారు వాదించారు.
{{/usCountry}}ఈ సినిమాను తెలుగు భాషలో రిలీజ్ చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ శ్రీప్రియ, రాజ్ కుమార్ సేతుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలియకుండా, తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేయడం చట్టవిరుద్ధమని వారు వాదించారు.
{{/usCountry}}ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కే కుమారేష్ బాబు కీలకమైన మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు ముందే ప్రైవేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి తరపున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి నోట్ చేశారు.
"ప్రతివాదులకు నోటీసులు అందినప్పటికీ వారి తరపున ఎవరూ కోర్టుకు రాలేదు, కాజ్ లిస్ట్ లో కూడా వారి పేర్లు ప్రింట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ కాపీరైట్ హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే రెస్పాండెంట్స్, వారి సిబ్బంది లేదా అసైనీలు ఎవరూ కూడా 'దృశ్యం 3' సినిమాను తెలుగు వెర్షన్ లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం" అని కోర్టు స్పష్టం చేసింది.