OTT Thriller: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. జీతూ జోసెఫ్ శిష్యుడు తీసిన ఈ మూవీని ఎందుకు చూడాలంటే?
OTT Thriller: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్లు తీయడంలో పాపులర్ అయిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ శిష్యుడు తెరకెక్కించిన ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? ఎందుకు చూడాలి? అనే విషయాలపై ఓ లుక్కేయండి.
OTT Thriller: మలయాళ సినిమా రంగంలో విలక్షణ నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో షేన్ నిగమ్. ఆయన లీడ్ రోల్‌లో నటించిన తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు ముస్తాబైంది.

దృఢం ఓటీటీ రిలీజ్ డేట్
మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ ఉత్కంఠభరిత చిత్రం దృఢం మంచి టాక్ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ నెల జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగులోనూ
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు తమ ఇంట్లోనే హాయిగా కూర్చుని ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను వీక్షించొచ్చు.
దృఢం స్టోరీ
దృఢం మూవీ కథ విషయానికి వస్తే.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సబ్-ఇన్‌స్పెక్టర్ విజయ్ రాధాకృష్ణన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఒక గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన విజయ్ రాధాకృష్ణన్‌కు ఆరంభంలో అంతా ప్రశాంతంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ ప్రాంతాన్ని వణికించే వరుస హత్యలు, ఒక భారీ బ్యాంకు దోపిడీ వంటి వరుస నేరాలు అక్కడ కలకలం రేపుతాయి.
ఈ సంక్లిష్టమైన కేసును ఛేదించే క్రమంలో ఆ యువ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, అతని నైపుణ్యానికి, పట్టుదలకు ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి అనే అంశాలను దర్శకుడు ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
జీతూ జోసెఫ్ శిష్యుడు
ఈ సినిమాతో మార్టిన్ జోసెఫ్ దర్శకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. దృశ్యం వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్‌కు మార్టిన్ జోసెఫ్ శిష్యుడు కావడం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి జోమోన్ జాన్, లింటో దేవసియా స్క్రిప్ట్ అందించారు.
ఈ ప్రాజెక్టును ఈ4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్‌పై ముకేష్ ఆర్. మెహతా, సి.వి. సారథి సంయుక్తంగా నిర్మించారు. స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తన సొంత బ్యానర్ 'బెడ్‌టైమ్ స్టోరీస్' కింద ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు సమర్పించడం సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ చిత్రంలో షేన్ నిగమ్‌తో పాటు సాన్య, శోభి తిలకన్, కృష్ణ ప్రభ, నందన్ ఉన్ని, దినేష్ ప్రభాకర్, కొట్టాయం రమేష్, బిట్టో డేవిస్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
ఎందుకు చూడాలంటే?
ఓటీటీలో జనరల్ గా మలయాళం సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్లు అంటే వేరే లెవల్. ఈ మూవీస్ సస్పెన్స్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తాయి. పైగా దృశ్యం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ శిష్యుడు మార్టిన్ దర్శకత్వం వహించడంతో దృఢంపై అంచనాలను మరింత పెంచింది. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లను ఎంజాయ్ చేయాలనుకునే ఆడియన్స్ కు ఇది మంచి ఆప్షన్.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
- 'దృఢం' సినిమా ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రం జూన్ 12 నుంచి ఓటీటీ వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
2. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది?
'దృఢం' సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.
3. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?
ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ శిష్యుడు మార్టిన్ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


