లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న దృశ్యం నటి ఎస్తర్ అనిల్..

దృశ్యం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం నటి ఎస్తర్ అనిల్ తాజాా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఆమె ఈ డిగ్రీ పొందడం విశేషం. ఆ ఫొటోలను ఎస్తర్ షేర్ చేసుకుంది.

Published on: Dec 18, 2025, 16:11:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'దృశ్యం' ఫేమ్ ఎస్తర్ అనిల్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్' నుంచి ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకప్పుడు ఆ చదువును వదులుకోవాలనుకున్నానని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చానని ఎస్తర్ రాసుకొచ్చిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న దృశ్యం నటి ఎస్తర్ అనిల్..
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న దృశ్యం నటి ఎస్తర్ అనిల్..

దృశ్యం పాప ఇప్పుడిలా..

వెంకటేశ్ నటించిన 'దృశ్యం' సినిమాలో చిన్న పాపగా నటించి అందరినీ ఆకట్టుకున్న ఎస్తర్ అనిల్ ఇప్పుడు పెద్దదైపోయింది. అంతేకాదు చదువులోనూ టాప్ అని నిరూపించుకుంది. ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పట్టా అందుకుంది. గ్రాడ్యుయేషన్ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె రాసిన నోట్ చదివి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

"నాన్నకు పిచ్చి అనుకున్నా.."

కొన్నేళ్ల క్రితం వాళ్ళ నాన్న ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ గురించి చెప్పినప్పుడు.. "ఇవన్నీ మనవల్ల అయ్యే పనులు కాదు.. నాన్నకు పిచ్చి, అందని ద్రాక్ష కోసం ఆశపడుతున్నారు" అనుకుందట ఎస్తర్ అనిల్.

"కానీ ఈరోజు ఆయన కూతురు అదే కాలేజీ ముందు గ్రాడ్యుయేట్ అయి నిలబడింది. లైఫ్ లో నిజంగా మ్యాజిక్ ఉంటుంది" అని ఎస్తర్ ఎమోషనల్ అయింది.

"డబ్బుల్లేవని ఇంట్లో చెప్పలేదు.."

ఎస్తర్ కు సీటు వచ్చాక కూడా మొదట్లో ఇంట్లో చెప్పలేదట. కారణం.. అప్పటికే తన ఇద్దరు అన్నయ్యలు స్టూడెంట్ లోన్లతో చదువుతున్నారు. ఎస్తర్ దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ భారీ ఫీజులు కట్టే స్తోమత తమకు లేదని ఆమెకు తెలుసు. కానీ విషయం తెలిశాక వాళ్ళ అమ్మనాన్నలు కష్టపడైనా సరే వెళ్లమని ధైర్యం చెప్పి పంపించారట. వారికి ఎస్తర్ కృతజ్ఞతలు తెలిపింది.

ప్రపంచంలోని బెస్ట్ స్టూడెంట్స్ మధ్య తాను ఒక ఫెయిల్యూర్ లా అనిపించేదాన్ని అని, 'ఇంపోస్టర్ సిండ్రోమ్'తో బాధపడ్డానని ఆమె నిజాయతీగా ఒప్పుకుంది. అయితే చివరికి 'ఉమెన్ అండ్ పవర్' అనే అంశంపై థీసిస్ రాసి ‘డిస్టింక్షన్’ సాధించింది. "బహుశా నేను అంత డల్ స్టూడెంట్ ని కాదేమో.. పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ లో నేను కూడా చేరతానేమో" అని రాసుకొచ్చింది.

ఎస్తర్ అనిల్ పోస్టుపై సెలబ్రిటీలు అయిన నజ్రియా నజీమ్, అపర్ణ బాలమురళి, ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా తదితరులు కంగ్రాట్స్ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్.. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో 'దృశ్యం' సిరీస్ లో నటించింది. తెలుగులో 'జోహార్' సినిమాలో లీడ్ రోల్ చేసింది. త్వరలో ‘దృశ్యం 3’లో మళ్ళీ అలరించనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More