ఈ వారం ఓటీటీలోని తెలుగు, తమిళం, మలయాళం కొత్త సినిమాలు, సిరీస్‌లు.. ఈ స్పెషల్ రిలీజ్‌ల‌పై ఓ లుక్కేయండి

ఈ వారం ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. డిసెంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొత్త చిత్రాలు, సిరీస్‌ల వివరాలు ఇవిగో. ఇందులో ఫార్మా, నయనం, హార్ట్‌లీ బ్యాటరీ వంటి వాటితో పాటు మరెన్నో స్పెషల్ రిలీజ్ లు ఉన్నాయి. 

Published on: Dec 18, 2025, 11:50:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం స్ట్రీమింగ్ జాబితాలో మలయాళం, తమిళ, తెలుగు చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త బ్యాచ్‌గా వస్తున్నాయి. హృదయానికి హత్తుకునే ఆంథాలజీలు, ఫ్యామిలీ స్టోరీలు, కామెడీ వంటి అనేక రకాల జానర్‌లలో ఈ కొత్త విడుదలలను మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ లేదా టాబ్లెట్‌లో ఆస్వాదించవచ్చు.

ఈ వారం ఓటీటీలోని తెలుగు, తమిళం, మలయాళం స్పెషల్ రిలీజ్ లు
ఈ వారం ఓటీటీలోని తెలుగు, తమిళం, మలయాళం స్పెషల్ రిలీజ్ లు

ఫార్మా

డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లర్ సిరీస్ ఫార్మా. ఇందులో నివిన్ పౌలీ, రంజిత్ కపూర్, నరైన్, బినూ పప్పు, శ్రుతి రామచంద్రన్, వీణ నందకుమార్ తదతరులు నటించారు. తన మొదటి మలయాళ వెబ్ సిరీస్‌లో నివిన్ పౌలీ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కేపీ వినోద్ పాత్రను పోషిస్తున్నాడు. కఠినమైన ఫార్మాస్యూటికల్ రంగంలో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అందులోని సీక్రెట్స్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది థ్రిల్ పంచుతుంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్

డిసెంబర్ 19, 2025న జీ5 ఓటీటీలోకి రానున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్, విజి వెంకటేష్, సిద్దీక్, వినీత్, విజయ్ బాబు తదితరులు నటించారు. ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఎజెన్సీ నడుపుతాడు. ఓ పర్స్ తో మిస్సింగ్ అమ్మాయి ట్విస్ట్ స్టోరీలో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్.

హార్ట్‌లీ బ్యాటరీ

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ వెబ్ సిరీస్ హార్ట్‌లీ బ్యాటరీ. డిసెంబర్ 16న ఓటీటీలో రిలీజైంది ఈ సైన్స్ ఫిక్సన్ థ్రిల్లర్. ఇందులో గురు లక్ష్మణ్, పడినే కుమార్, సుమిత్రా దేవి, అనిత్ యష్ పాల్, యోగ లక్ష్మి తదితరులు నటించారు. ఇందులో ఒకరిపై ప్రేమ ఎంత ఉందో తెలుసుకునే లవ్ మీటర్ ను హీరోయిన్ కనిపెడుతుంది.

నయనం

తెలుగులో రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ నయనం. వరుణ్ తేజ్ ఓటీటీ కోసం చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. నయనం సిరీస్ డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ సందేశ్, ఉత్తేజ్, ప్రియాంక ఎం జైన్, అలీ రెజా, రేఖ నిరోషా, హరీష్ తదితరులు నటించారు. ఇందులో కళ్ల డాక్టర్ మిస్టరీలు ఉంటాయి. కళ్లద్దాలతో అవతలి వాళ్లు 4 నిమిషాల పాటు ఏం చేస్తున్నారో అతను చూడగలడు.

రాజు వెడ్స్ రాంబాయి

ఇవాళ ఓటీటీలో రిలీజైన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి. ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో అఖిల్, తేజస్వి రావు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రాజుతో పెళ్లికి రాంబాయి తండ్రి ఒప్పుకోడు. దీంతో ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని ముందే రాంబాయిని గర్భవతిని చేస్తాడు రాజు.

ప్రేమంటే

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన కామెడీ లవ్ స్టోరీ ప్రేమంటే. ఇందులో సుమ కనకాల కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ డిసెంబర్ 19న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది.

దివ్య దృష్టి

డిసెంబర్ 19న సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రాబోతున్న హారర్ థ్రిల్లర్ దివ్య దృష్టి. ఇందులో ఈషా చావ్లా, సునీల్, కమల్ కామరాజు తదితరులు నటించారు. ఈ కథ భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగల సామర్థ్యంతో కూడిన ఇద్దరు సోదరీమణుల చుట్టూ తిరుగుతుంది. ఇది నేరుగా ఓటీటీలోకి రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More