...
...
Next Story

జీతూ జోసెఫ్ టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. దృశ్యం డైరెక్టర్ లేటెస్ట్ థ్రిల్లర్ ఓటీటీలో చూశారా?

మలయాళంలో దృశ్యంలాంటి థ్రిల్లర్ మూవీ అందించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ లేటెస్ట్ థ్రిల్లర్ మిరాజ్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇప్పటి వరకూ ఈ డైరెక్టర్ తీసిన టాప్ 5 థ్రిల్లర్ మూవీస్ ఏవో మీకు తెలుసా?

Published on: Oct 21, 2025, 10:44:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

డైరెక్టర్ జీతూ జోసెఫ్ మలయాళం ఇండస్ట్రీకి చెందిన అత్యంత విజయవంతమైన డైరెక్టర్లలో ఒకరు.అతడు రూపొందించిన దృశ్యం సినిమాలు ఇతర సినిమా పరిశ్రమలలో కూడా జీతూకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే మలయాళ ఫిల్మ్ మేకర్ అయిన జీతూ జోసెఫ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మిరేజ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

జీతూ జోసెఫ్ టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. దృశ్యం డైరెక్టర్ లేటెస్ట్ థ్రిల్లర్ ఓటీటీలో చూశారా?
జీతూ జోసెఫ్ టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. దృశ్యం డైరెక్టర్ లేటెస్ట్ థ్రిల్లర్ ఓటీటీలో చూశారా?

ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే, కథనం సరిగా లేవని విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే గతంలో జీతూ జోసెఫ్ ఎన్నో మంచి థ్రిల్లర్లు అందించాడు. మరి వాటిలో టాప్ 5 మూవీస్ ఏవో చూడండి.

1. దృశ్యం - ప్రైమ్ వీడియో

దృశ్యం సినిమా నిజంగా జీతూ జోసెఫ్‌ను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. అతడు అంతకుముందు తీసిన మై బాస్ సినిమా విజయం సాధించినప్పటికీ, దృశ్యం సినిమానే అతన్ని ఓ మాస్టర్ స్టోరీటెల్లర్ గా నిలబెట్టింది. 2013లో జీతూ జోసెఫ్ తొలిసారిగా మోహన్‌లాల్‌తో కలిసి పనిచేశాడు. ఈ కాంబినేషన్ మలయాళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా జార్జ్ కుట్టి అనే సాధారణ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని ఇంట్లో ఒక నేరం జరిగిన తరువాత కుటుంబం జీవితం తలకిందులవుతుంది. పోలీసుల నుండి తన కుటుంబాన్ని రక్షించడానికి అతను ఎన్ని ఎత్తుగడలు వేశాడన్నది ఈ సినిమాల్లో చూడొచ్చు.

2. మెమోరీస్ - ప్రైమ్ వీడియో

దృశ్యం కంటే ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమాతో జీతూ జోసెఫ్ తన థ్రిల్లర్ సినిమాల మీద పట్టు నిరూపించుకున్నాడు. తన కుటుంబాన్ని కోల్పోయి, ఆ బాధలో పడి మద్యం మత్తులో మునిగిపోయిన మాజీ పోలీస్ ఆఫీసర్ సామ్ అలెక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుసగా అదృశ్యమవుతున్న యువతుల రహస్యాన్ని ఛేదించే బాధ్యత అలెక్స్‌కు అప్పగిస్తారు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఈ థ్రిల్లర్ మూవీ కథాంశం.

3. నేరు - జియోహాట్‌స్టార్

యువ నటుడు ప్రణవ్ మోహన్‌లాల్ (సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు) ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇందులో అతను ఒక పలుకుబడిగల వ్యక్తి మరణం తర్వాత పారిపోయిన ఆది అనే వ్యక్తి పాత్ర పోషించాడు. సినిమా ఫాస్ట్-పేస్ కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, ముఖ్యంగా ప్రణవ్ మోహన్‌లాల్ నటన ఈ సినిమాకి హైలైట్స్.

5. మై బాస్ - జియోహాట్‌స్టార్

మై బాస్ సినిమాతో కామెడీని కూడా తాను చాలా తేలికగా హ్యాండిల్ చేయగలనని జీతూ జోసెఫ్ నిరూపించాడు. ఇందులో నటుడు దిలీప్.. మను అనే పాత్రను పోషించాడు. మమతా మోహన్‌దాస్ బాస్ లేడీ ప్రియ పాత్రలో నటించింది. ఒక సాధారణ మలయాళీ వ్యక్తికి అర్బన్ మహిళకు మధ్య ఉన్న తేడాను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ మూవీ అమెరికన్ చిత్రం ది ప్రపోజల్ ను పోలి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe