Drishyam The Conclusion Trailer: దృశ్యం ది కన్‌క్లూజన్ ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దొరికిపోయాడా? ఊహించని ట్విస్ట్

Drishyam The Conclusion Trailer: దృశ్యం హిందీ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న మూడో సినిమా దృశ్యం: ది కన్‌క్లూజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తిరిగి వస్తున్నాడు.

Published on: Sep 9, 2026, 15:24:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Drishyam The Conclusion Trailer: అజయ్ దేవగన్ ఐకానిక్ క్యారెక్టర్ విజయ్ సల్గాంకర్‌ను ఈసారి చట్టం బోనులో నిలబెట్టడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన 'దృశ్యం: ది కన్‌క్లూజన్' (Drishyam: The Conclusion) ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Drishyam The Conclusion Trailer: దృశ్యం ది కన్‌క్లూజన్ ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దొరికిపోయాడా? ఊహించని ట్విస్ట్
Drishyam The Conclusion Trailer: దృశ్యం ది కన్‌క్లూజన్ ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దొరికిపోయాడా? ఊహించని ట్విస్ట్

గతంలో పోలీసుల కళ్లు కప్పి, సమర్థవంతంగా సాక్ష్యాలను మాయం చేసిన విజయ్ సల్గాంకర్‌కు ఈసారి అసలైన కాళరాత్రి ఎదురైనట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీస్ స్టేషన్ పునాదుల్లో దాచిపెట్టిన సమీర్ దేశ్‌ముఖ్ శవం గుట్టు రట్టు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ రౌండ్ వేసింది.

జైదీప్ అహ్లావత్ ఎంట్రీ.. నరాలు తెగే ఉత్కంఠ

మలయాళం బ్లాక్‌బస్టర్ దృశ్యం ఫ్రాంఛైజీ ఆధారంగా హిందీలో తెరకెక్కిన సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు దృశ్యం: ది కన్‌క్లూజన్ పేరుతో మూడో మూవీని తీసుకొస్తున్నారు.

ఈ మూడో భాగంలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఎస్పీ క్రైమ్ బ్రాంచ్ రాజ్‌వీర్ సింగ్ తోమర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ ఎంట్రీ ఇవ్వడమే. జైదీప్ అహ్లావత్ తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో విలన్ పాత్ర స్థాయిని వేరే లెవెల్‌కు తీసుకెళ్లారు.

ట్రైలర్‌లో విజయ్ సల్గాంకర్‌ను జైదీప్ ప్రశ్నించే సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పీ గుండె మీద చేయి వేసి పల్స్ చెక్ చేస్తూ విజయ్ సమాధానం చెప్పడం, వెంటనే ఎస్పీ రివర్స్‌లో శవం ఎక్కడుందో నిలదీయడం చూస్తే ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠ కలుగుతోంది.

ప్రతీకారం కోసం టబు, ప్రకాష్ రాజ్

తన కొడుకు చావుకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మీరా దేశ్‌ముఖ్ (టబు) రగిలిపోతోంది. ఆమెకు తోడుగా రచయిత మురాద్ అలీ (సౌరభ్ శుక్లా), అలాగే అగ్ర నటుడు ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో విజయ్‌ను చట్టానికి పట్టిచ్చేందుకు పక్కా ప్లాన్ వేశారు.

సినిమాలు, క్రైమ్ నవలలు చూసి ఐడియాలు కాపీ కొట్టే విజయ్ ఈసారి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడోనని మీరా దేశ్‌ముఖ్ ఆందోళన చెందుతుంటే.. లాయర్‌గా ప్రకాష్ రాజ్ వేసే ప్రశ్నలు విజయ్ జీవితాన్ని తలకిందులు చేసేలా ఉన్నాయి. విజయ్ ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అక్టోబర్ 2న థియేటర్లలోకి బిగ్గెస్ట్ థ్రిల్లర్

డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఈసారి సరికొత్త కథనం, స్క్రీన్‌ప్లేతో ఈ ఫ్రాంచైజీకి ఓ సరికొత్త ముగింపు ఇవ్వబోతున్నారు. విజయ్ కేవలం తన తెలివితోనే కాకుండా ఈసారి అదృష్టం, కాలంతో కూడా పోరాడాల్సి వస్తోంది.

భారతీయ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైండ్ గేమ్ థ్రిల్లర్‌గా నిలిచిన 'దృశ్యం' సిరీస్‌కు ఇది చివరి ఘట్టం. 'దృశ్యం 3' అక్టోబర్ 2న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మలయాళంలో నాలుగో భాగం రానుందని ఇప్పటికే అనౌన్స్ చేసినా.. హిందీలో మాత్రం మూడుతోనే ముగింపు పలకబోతున్నారు. ఇక తెలుగులో దృశ్యం 3 వచ్చే అవకాశం లేనట్లే. ఇప్పటికే మలయాళం ఒరిజినల్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More