Drishyam 4: థ్రిల్లర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. జార్జ్ కుట్టీ మళ్లీ రాబోతున్నాడు.. దృశ్యం 4 మూవీపై ప్రొడ్యూసర్ ఏమన్నారంటే?
Drishyam 4: మలయాళ ఐకానిక్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం' ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కు అదిరే అప్డేట్. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో భాగం కూడా రాబోతోంది. మోహన్‌లాల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ అధికారికంగా స్పష్టం చేశారు.
Drishyam 4: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఫ్రాంఛైజీ 'దృశ్యం'. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి మరో మైండ్ బ్లాస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. 'దృశ్యం 3' థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగం (Drishyam 4) నిర్మించడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు.

దృశ్యం 4 వస్తుంది!
ఇటీవల 'మళవిల్ మనోరమా' నిర్వహించిన ఒక వేడుకలో పాపులర్ మలయాళ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ఈ విషయమై అధికారిక ప్రకటన చేశారు. "దృశ్యం 4 కచ్చితంగా తెరకెక్కుతుంది. మోహన్‌లాల్ మళ్లీ జార్జ్‌కుట్టి పాత్రలో అలరిస్తారు. ఇది నా హృదయం లోపలి నుంచి వస్తున్న నిజం" అని ఆంటోనీ స్పష్టం చేశారు.
ఏడు సినిమాలు
ఇటీవల మోహన్‌లాల్ ఏడుగురు వేర్వేరు దర్శకులతో చేయబోయే ఏడు సినిమాల వివరాలను పంచుకున్నారు. ఆ జాబితాలో 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ పేరు కూడా ఉంది. అయితే జీతూ జోసెఫ్‌తో చేయబోయే సినిమా 'దృశ్యం 4' అవుతుందా లేక కొత్త కథతో రూపొందుతుందా అనే విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
దృశ్యం 3 ఇలా
'దృశ్యం 3' కథ 'దృశ్యం 2' సంఘటనలు జరిగిన ఐదేళ్ల తర్వాత సాగుతుంది. జార్జ్‌కుట్టి తన పాత జీవిత కథ ఆధారంగా ఒక విజయవంతమైన సినిమాను నిర్మించి, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కానీ, యామి, రోనీ అనే అధికారులు వరుణ్ మృతి వెనుక ఉన్న అసలు సత్యాన్ని బయటకు తీసేందుకు మళ్లీ విచారణ ప్రారంభిస్తారు.
పాత పగను మనసులో ఉంచుకున్న రాజన్, సహదేవన్, ప్రభాకర్, గీత అంతా కలిసి జార్జ్‌కుట్టి, ఆయన కుమార్తె అంజులను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా ప్లాన్ వేస్తారు.
అదే కథ
అయితే జార్జ్‌కుట్టి ఆ కుట్రను ఛేదించి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ రంగంలోకి దిగుతాడు. తీవ్రమైన ఒత్తిడి మధ్య తన కుటుంబానికి రక్షణ కల్పించే షరతులతో జార్జ్‌కుట్టి అధికారులకు లొంగిపోతాడు. కానీ కథ ముగింపులో, అంజును కూడా నేరస్తురాలిగా నిలబెట్టాలని గీత పట్టుబట్టడంతో ఆ కేసు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఆ ఉత్కంఠభరిత క్లైమాక్సే ఇప్పుడు 'దృశ్యం 4' కథకు బలమైన పునాదిగా మారింది.
మోహన్‌లాల్ కొత్త ప్రాజెక్టులు
ప్రస్తుతం మోహన్‌లాల్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం 'అతిమనోహరం' 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తోంది.
ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న 'జైలర్ 2' చిత్రంలో కూడా మోహన్‌లాల్ ఒక ప్రత్యేక క్యామియో పాత్రలో అలరించనున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


