Patriot Trailer: దేశ రహస్యాల కోసం పోరాటం.. గూఢచారిగా మారిన మమ్ముట్టి.. కాపాడే మోహన్‌లాల్.. అదిరిన పేట్రియాట్ ట్రైలర్

Patriot Trailer: మలయాళ సినిమా లెజెండ్స్ మోహన్ లాల్, మమ్ముట్టి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిశారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటిస్తున్న మూవీ ‘పేట్రియాట్’. శనివారం రిలీజ్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ అదిరిపోయింది. 

Published on: Apr 4, 2026, 20:22:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సుమారు దశాబ్ద కాలం తర్వాత పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం 'పేట్రియాట్'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. దేశ భద్రత, అత్యాధునిక టెక్నాలజీ, స్నేహం నేపథ్యంలో సాగే ఈ కథలో ఇద్దరు దిగ్గజాలు పోటాపోటీగా నటించినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

పేట్రియాట్ లో మోహన్ లాల్, మమ్ముట్టి
పేట్రియాట్ లో మోహన్ లాల్, మమ్ముట్టి

పేట్రియాట్ ట్రైలర్

లెజెండరీ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘పేట్రియాట్’. శనివారం (ఏప్రిల్ 4) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో మమ్ముట్టి ఒక రిటైర్డ్ జేఏజీ (JAG) ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దేశ రహస్యాలను సేకరించే సామర్థ్యం ఉన్న ఒక శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ గురించి ప్రపంచానికి తెలియజేసే వ్లాగర్‌గా ఆయన పాత్రను మలిచారు. అయితే, ఆయనపై గూఢచారి అనే ముద్ర వేసి తప్పుడు కేసులో ఇరికించడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

మోహన్‌లాల్ ఎంట్రీ

తనపై ఆరోపణలు రావడంతో మమ్ముట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే దేశానికి పెను ముప్పు పొంచి ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్ముట్టికి సహాయం చేసే సాయుధ దళాల అధికారిగా మోహన్‌లాల్ ఎంట్రీ ఇస్తారు. వీరిద్దరి మధ్య ఉన్న పాత స్నేహం, దేశం కోసం వారు చేసే పోరాటం వెండితెరపై అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు వేదిక కానుంది.

ఫ్యాన్స్ రియాక్షన్

పేట్రియాట్ ట్రైలర్ తెగ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. "ఈ ఇద్దరు దిగ్గజాలు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం" అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా, "పేట్రియాట్ సినిమా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది" అని మరొకరు పేర్కొన్నారు.

ఇద్దరు కలిసి

మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఇప్పటివరకూ 50కి పైగా సినిమాల్లో నటించారు. గతంలో 'నెం.20 మద్రాస్ మెయిల్', 'హరిహర్ నగర్', 'ట్వంటీ:20' వంటి మూవీస్ లో కలిసి అదరగొట్టారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ కుదరడంతో కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు పేట్రియాట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పేట్రియాట్ రిలీజ్

పేట్రియాట్ సినిమాలో మోహన్‌లాల్, మమ్ముట్టితో పాటు గ్రేస్ ఆంటోనీ, జరీన్ షిహాబ్, శ్రీపార్వతి, గీతి సంగీత, జిను జోసెఫ్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిఖీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక కారణాల వల్ల చిత్ర విడుదల తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఫస్ట్ ఏమో ఏప్రిల్ 23న పేట్రియాట్ ను విడుదల చేయాలని భావించారు. కానీ హై క్వాలిటీ మూవీని అందించాలనే లక్ష్యంతో 'పేట్రియాట్'ను మే 1వ తేదీకి వాయిదా వేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More