Dulquer Salmaan: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి క్లాసిక్ హిట్స్‌తో తెలుగు ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దుల్కర్.. ప్రస్తుతం తన కొత్త డైరెక్ట్ తెలుగు సినిమా 'శ్రీ శ్రీ' (Sri Sri) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్‌లో జరుగుతున్న ఈ సినిమా అవుట్‌డోర్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ పూజా హెగ్డేలు వైజాగ్ చేరుకున్నారు.
ఎగబడిన లేడీ ఫ్యాన్స్

అయితే షూటింగ్ స్పాట్ వద్ద దుల్కర్ సల్మాన్‌ను స్వయంగా చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఆయన తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారులో బీచ్ సైడ్ షూటింగ్ స్పాట్‌కు చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. దుల్కర్‌ను చూడగానే అక్కడ ఉన్న లేడీ ఫ్యాన్స్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్ దాటుకుని ఆయన దగ్గరకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
దుల్కర్ బాడీగార్డ్స్ సీరియస్
షూటింగ్ స్పాట్‌లో దుల్కర్ కారు దిగి తన వ్యానిటీ వ్యాన్ వైపు వెళ్తుండగా.. ఒక లేడీ ఫ్యాన్ భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి దూసుకొచ్చింది. "ప్లీజ్ సర్.. ఒక్క ఫోటో" అంటూ గట్టిగా అరుస్తూ దుల్కర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన దుల్కర్ సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని పక్కకు నెట్టివేస్తూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో దుల్కర్ పర్సనల్ టీమ్ మెంబర్ ఒకరు తీవ్ర అసహనానికి గురై సీరియస్ గా చూడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మరో వీడియోలో దుల్కర్ చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఒక రక్షణగా ఏర్పడి ఆయనను సేఫ్‌గా వ్యానిటీ వ్యాన్‌కు తీసుకెళ్లడం చూడొచ్చు. అక్కడ కూడా ఒక అమ్మాయి "సర్.. సర్.." అని అరుస్తూ సెల్ఫీ కోసం రెక్వెస్ట్ చేసింది. మొదట రద్దీ కారణంగా అటువైపు చూడకుండా వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లిన దుల్కర్.. ఆ తర్వాత కాసేపటికి బయటకు వచ్చి ఓపికగా ఫ్యాన్స్‌ను పలకరించారు. అభిమానులతో ఎంతో సరదాగా మాట్లాడుతు సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఒక అభిమాని ఆంధ్ర సాంప్రదాయం ప్రకారం ఆయనను సన్మానించడం విశేషం.
'శ్రీ శ్రీ' ప్రాజెక్ట్ విశేషాలు, దుల్కర్ కెరీర్ గ్రాఫ్
కొత్త డైరెక్టర్ రవి నెలకూడితి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'శ్రీ శ్రీ' సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, సచిన్ ఖేడేకర్ వంటి దిగ్గజ నటులు పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ లేదా జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందించనున్న ఈ సినిమాకి అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
{{/usCountry}}కొత్త డైరెక్టర్ రవి నెలకూడితి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'శ్రీ శ్రీ' సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, సచిన్ ఖేడేకర్ వంటి దిగ్గజ నటులు పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ లేదా జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందించనున్న ఈ సినిమాకి అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
{{/usCountry}}గతేడాది మలయాళంలో వచ్చిన 'కింగ్ ఆఫ్ కొత్త' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ.. ఈ ఏడాది రీసెంట్‌గా విడుదలైన 'ఐ యామ్ గేమ్' (I'm Game) మూవీతో దుల్కర్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ప్రొడ్యూసర్‌గా 'లోక చాప్టర్ 1' (Lokah: Chapter 1)తో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాశారు. ప్రస్తుతం తెలుగులో 'శ్రీ శ్రీ'తో పాటు పవన్ సాదినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అనే ఫీల్ గుడ్ మూవీ చేస్తున్నారు. వరుసగా టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతుండటంతో తెలుగు ఫ్యాన్స్‌లో దుల్కర్ సల్మాన్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరింది.