ENE Repeat Trailer: పిచ్చెక్కిపోతది ఆడియెన్స్‌కి.. డబుల్ ఫన్‌తో ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్.. వివేక్ అండ్ గ్యాంగ్ రచ్చ

ENE Repeat Trailer: యూత్‌ఫుల్ కల్ట్ క్లాసిక్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కాంబినేషన్ లో నవంబర్ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Published on: Nov 3, 2026, 17:27:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ENE Repeat Trailer: యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) ట్రైలర్ ఎట్టకేలకు మంగళవారం (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా అంతకుమించిన క్రేజీ అడ్వెంచర్, నవ్వుల పువ్వులు పూయించే డైలాగ్స్‌తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ ట్రైలర్‌ను మలచడం విశేషం.

ENE Repeat Trailer: పిచ్చెక్కిపోతది ఆడియెన్స్‌కి.. డబుల్ ఫన్‌తో ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్.. వివేక్ అండ్ గ్యాంగ్ రచ్చ
ENE Repeat Trailer: పిచ్చెక్కిపోతది ఆడియెన్స్‌కి.. డబుల్ ఫన్‌తో ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్.. వివేక్ అండ్ గ్యాంగ్ రచ్చ

ఈఎన్ఈ రిపీట్ స్టోరీ ఇలా..

ఈ చిత్రంలో వివేక్ అండ్ గ్యాంగ్ (విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మగాంటి) మరోసారి సర్వైవల్ కాన్సెప్ట్‌ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచనతో ఒక దగ్గరకు చేరుకుంటారు. అయితే వారి ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగదు. అనూహ్యమైన మలుపులు, అనుకోని చిక్కులు, అడుగడుగునా కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగింది.

ఆడియెన్స్ కు పిచ్చెక్కిపోయే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తీయడానికి వివేక్ (విశ్వక్ సేన్) రెడీ అవడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. అతనితో అతని ఫ్రెండ్స్ కూడా చేరతారు. కానీ మూవీ తీసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు వాళ్ల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వివేక్ తన కలల మూవీ తీస్తాడా లేదా అన్నది ఈ మూవీలో చూడొచ్చు.

తరుణ్ భాస్కర్ మార్క్ హ్యూమర్.. అదనపు ఆకర్షణగా హీరోయిన్లు

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తనదైన మార్క్ టైమింగ్, సహజసిద్ధమైన సంభాషణలతో ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. సాధారణ సంఘటనల నుంచి కూడా అత్యంత వినోదాన్ని రాబట్టే ఆయన శైలి ఈ సీక్వెల్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ సీక్వెల్‌లో ప్రధాన తారాగణం కాంబినేషన్ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది. వీరితో పాటు అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించి కథపై మరింత క్యూరియాసిటీని పెంచారు.

గ్రాండ్ టెక్నికల్ వాల్యూస్, థియేట్రికల్ రిలీజ్ డేట్

వివేక్ సాగర్ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ మూడ్‌ని సరిగ్గా ఎలివేట్ చేసింది. ఏజే ఆరాన్ సినిమాటోగ్రఫీ రిచ్ అండ్ కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

పాత జ్ఞాపకాలను రీ-క్రియేట్ చేస్తూనే, సరికొత్త స్టోరీలైన్‌తో నవంబర్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ గ్యాంగ్ మళ్లీ వెండితెరపై చేసే రచ్చ కోసం యూత్ కాచుకుని కూర్చున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More