మా నాన్న కూడా నా పెళ్లెప్పుడు అని అడిగాడు: తరుణ్ భాస్కర్‌తో రిలేషన్షిప్‌పై ఈషా రెబ్బ కామెంట్స్

ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ రిలేషన్షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో నటి దీనిపై స్పందించింది. తమ నెక్ట్స్ మూవీ ఓం శాంతి శాంతి శాంతి ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడింది.

Published on: Jan 26, 2026, 19:38:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా ఇండస్ట్రీల్లో హీరో, హీరోయిన్ కు మధ్య ఏదో ఉందన్న పుకార్లు కామనే. అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ.. డైరెక్టర్, యాక్టర్ అయిన తరుణ్ భాస్కర్ తో రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. దీనిపై తాజాగా ఈషా స్పందిస్తూ.. ఈ వార్తలు విని తన తండ్రి కూడా పెళ్లెప్పుడు అని అడిగినట్లు చెప్పడం విశేషం.

మా నాన్న కూడా నా పెళ్లెప్పుడు అని అడిగాడు: తరుణ్ భాస్కర్‌తో రిలేషన్షిప్‌పై ఈషా రెబ్బ కామెంట్స్
మా నాన్న కూడా నా పెళ్లెప్పుడు అని అడిగాడు: తరుణ్ భాస్కర్‌తో రిలేషన్షిప్‌పై ఈషా రెబ్బ కామెంట్స్

తరుణ్ భాస్కర్‌తో పెళ్లి నిజమేనా?

ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ కలిసి ప్రస్తుతం ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో నటించారు. ఈ మూవీ శుక్రవారం (జనవరి 30) థియేటర్లలోకి రానుంది. మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ జయ జయ జయ జయహే సినిమాకు ఇది రీమేక్. ఈ సందర్భంగా ఈషా రెబ్బ మీడియాతో మాట్లాడింది. పెళ్లి విషయం ప్రస్తావించిన సమయంలో తాను కూడా ఈ పుకార్లు విన్నట్లు చెప్పింది.

“నేను కూడా ఆ పుకార్ల గురించి విన్నాను. దీనిపైనే నేను ఫన్నీ ఇన్‌స్టా రీల్ కూడా చేశాను. ఈ వార్తలు విని మా నాన్న కూడా నా పెళ్లెప్పుడు అని అడిగాడు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా జీవితంలో నా నియంత్రణలో లేని వాటి గురించి మాట్లాడను. అలాంటిదేమైనా ఉంటే మీకు ముందే చెబుతాను” అని ఈషా స్పష్టం చేసింది.

డేటింగ్ మాత్రం నిజం

అయితే ఈషా రెబ్బ డేటింగ్ లో మాత్రం ఉన్నదట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నదని తెలిపింది. అది ఎవరన్నది మాత్రం చెప్పలేదు. నిజానికి గతేడాది దీపావళి సందర్భంగా ఈషా, తరుణ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలు బయటకు రావడంతో వీరి మధ్య రిలేషన్షిప్ పుకార్లు మరింత పెరిగాయి. ఇప్పుడు ఓ సినిమాలో కలిసి నటించారు.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈషా క్లారిటీ ఇచ్చినా.. ఆ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ను మాత్రం కొనసాగించింది. ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ఈ శుక్రవారం (జనవరి 30) రిలీజ్ కానుంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని చూసి తర్వాత ఆమె చేతుల్లో తన్నులు తినే భర్త పాత్రలో తరుణ్ భాస్కర్ నటించాడు. ఈ సినిమాకు మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More