...
...
Next Story

Endhayya Saami Lyrics: ఏందయ్యా సామి ఈ లిరిక్స్.. బుర్రలో తిరుగుతున్న అక్షరాలు.. మీరూ పాడేయండి.. ఏందయ్యా సామి లిరిక్స్

Endhayya Saami Lyrics: ఏందయ్యా సామి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే లిరిక్స్ వినిపిస్తున్నాయి. ఇదే సాంగ్ మళ్లీ మళ్లీ రిపీట్ ప్లే అవుతుంది. రణబాలి, జయమ్మ లవ్ అంటూ రిలీజైన ఈ పాట మనసులను తాకుతోంది.

Published on: Mar 1, 2026, 11:25:30 IST
Advertisement

ఏందయ్యా సామి అనే పాట ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. రణబాలి మూవీ నుంచి వచ్చిన ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ మ్యూజిక్ లవర్స్ ను మెల్ట్ చేస్తోంది. ఇంత బాగా ఎలా రాశారు అంటూ నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఆ అచ్చ తెలుగు అక్షరాలు అద్భుతమని పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఏందయ్యా సామి సాంగ్

రణబాలి మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (x/RanabaaliFilm)
రణబాలి మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (x/RanabaaliFilm)

రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో వీళ్ల వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. వీళ్ల వివాహాన్ని పురస్కరించుకుని సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా రణబాలి మూవీ టీమ్ ‘ఏందయ్యా సామి’ సాంగ్ ను రిలీజ్ చేసింది. రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త జంట

రణబాలి మూవీ నుంచి రిలీజైన ఏందయ్యా సామి సాంగ్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఓ వైపు మనసును తాకే లిరిక్స్, మరోవైపు విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీతో వీడియో అదిరిపోయింది. కొత్తగా పెళ్లయిన జంట ముద్దు ముచ్చట్లను ఈ వీడియోలో చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ విజయ్, రష్మికకు పెళ్లయింది కాబట్టి ఈ సాంగ్ పర్ఫెక్ట్ టైమ్ లో, పర్ఫెక్ట్ గిఫ్ట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ సాంగ్ కు ఇప్పటివరకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఫస్ట్ మూవీ

పెళ్లి అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫస్ట్ మూవీ ఇది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. విరోష్ జోడీ ఇప్పటివరకూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు.

ఏందయ్యా సామి సాంగ్ లిరిక్స్

ఏందయ్యా సామి ఇట్ట గాస్తాంది ఎన్నెల

ఊపేస్తావుంది సిత్తరాల ఉయ్యాలా..

వీచేగాలికి అత్తరద్దిందెవ్వరో..

మారే జాముకి మందు పెట్టిందెవ్వరో

మాయదారి మనస్సాగాక జాగరమయ్యారా

తడిసిపోయారా.. తడి మెరిసిపోయారా

నీ చెలిమి కలల్లో ఒళ్లు మరిసిపోయారా..

తడిసిపోయారా.. తడి మెరిసిపోయారా

నీ చెలిమి కలల్లో ఒళ్లు మరిసిపోయారా

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe