Endhayyasaami Song: ఏందయ్యాసామీ వచ్చేసింది.. రణబాలి నుంచి లిరికల్ వీడియో రిలీజ్.. విజయ్, రష్మిక వింటేజ్ లవ్ ట్రాక్

Endhayyasaami Song: రణబాలి మూవీ నుంచి ఏందయ్యసామీ అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఈ లిరికల్ వీడియోలో రియల్ లైఫ్ భార్యాభర్తలైన విజయ్, రష్మిక వింటేజ్ లవ్, రొమాన్స్ బాగా ఆకట్టుకునేలా సాగింది.

Published on: Sep 22, 2026, 14:49:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Endhayyasaami Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ డ్రామా 'రణబాలి' మ్యూజికల్ ప్రోమోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికే భారీ ట్రెండింగ్ సృష్టించగా, తాజాగా విడుదలైన 'ఏందయ్యా సామి' ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను రూల్ చేస్తోంది.

Endhayyasaami Song: ఏందయ్యాసామీ వచ్చేసింది.. రణబాలి నుంచి లిరికల్ వీడియో రిలీజ్.. విజయ్, రష్మిక వింటేజ్ లవ్ ట్రాక్
Endhayyasaami Song: ఏందయ్యాసామీ వచ్చేసింది.. రణబాలి నుంచి లిరికల్ వీడియో రిలీజ్.. విజయ్, రష్మిక వింటేజ్ లవ్ ట్రాక్

1850ల నాటి వింటేజ్ ప్రేమకథ.. విజయ్, రష్మిక రొమాంటిక్ మ్యాజిక్

రణబాలి నుంచి వచ్చిన ఏందయ్య సామి పాటలో 1850ల కాలం నాటి గ్రామీణ వాతావరణం, సాంప్రదాయ పెళ్లి తంతు, కొత్త జంట ముచ్చట్లను చాలా అందంగా చూపించారు. విజయ్ దేవరకొండ 'రణబాలి' పాత్రలో రగ్గడ్ అండ్ రోమాంటిక్ లుక్‌లో కనిపిస్తే, రష్మిక 'జయమ్మ' పాత్రలో క్లాసిక్ తెలుగు అమ్మాయిగా మెరిసిపోయింది.

గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఈ హిట్ జోడీ.. పెళ్లి తర్వాత తొలిసారి ఈ పీరియాడిక్ డ్రామాలోనూ అదే కెమిస్ట్రీతో మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పల్లెటూరి సంప్రదాయ పద్ధతులు పాట మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మొగుడిపై రష్మిక మనసు పారేసుకోవడం, అతడు పట్టించుకోకుండా తిరగడం ఈ పాటలో చూడొచ్చు. కండలు తిరిగిన దేహంతో విజయ్ లుక్ అదిరిపోయింది. రియల్ లైఫ్ లో భార్యాభర్తలు రీల్ లైఫ్ లో తమ రొమాన్స్ తో జీవించేశారు.

అజయ్-అతుల్ మ్యూజిక్ మ్యాజిక్.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కేక

ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ అందిస్తున్న సౌండ్‌ట్రాక్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. 'ఏందయ్యా సామి' మెలోడీలో ఆర్కెస్ట్రేషన్, ఎమోషనల్ ట్యూన్ ప్రతీ ఒక్కరి మనసును హత్తుకునేలా ఉన్నాయి.

ప్రముఖ గాయకులు శ్వేతా మోహన్, అజయ్ గోగావాలే తమ అద్భుతమైన గొంతుతో ఈ పాటను రీసెంట్‌ టైమ్‌లోనే బెస్ట్ లవ్ మెలోడీగా మార్చేశారు. ఇక సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం నమ్మకం, తోడు, జీవితాంతం ఉండే ప్రేమను ఎంతో అద్భుతంగా వర్ణించింది.

అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్

ఈ సినిమా టీజర్‌తోనే భారీ అంచనాలు పెంచేసిన రణబాలి టీమ్.. ఇప్పుడు మొదటి పాటతో ఆ క్రేజ్‌ను డబుల్ చేసింది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీని మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది.

అన్ని రకాల హంగులతో సిద్ధమవుతున్న 'రణబాలి' చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కింగ్డమ్ తో బోల్తా పడిన విజయ్.. చాలా ఏళ్లుగా మంచి హిట్ కోసం చూస్తుండగా.. రష్మిక మాత్రం వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది. వాళ్ల పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More