ENE Repeat Collections: యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'ఈఎన్‌ఈ రిపీట్' (ENE Repeat) థియేటర్లలో నవ్వుల తుఫాను సృష్టిస్తోంది. నవంబర్ 19న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
పార్ట్ 1 రికార్డ్ గల్లంతు!

ప్రజల కోసం తీసిన సినిమాను ప్రజలే పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ చిత్ర బృందం తాజాగా అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, 'ఈఎన్‌ఈ రిపీట్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
2018లో విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 1 తన పూర్తి థియేట్రికల్ రన్‌లో సుమారు రూ. 12 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే, ఇప్పుడు సీక్వెల్ మాత్రం కేవలం మొదటి రోజు వసూళ్లతోనే పార్ట్ 1 లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.
విశ్వక్ సేన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్‌లో ఈఎన్ఈ రిపీట్ చిత్రం సరికొత్త మైలురాయిగా నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా భారత్‌లో తొలి రోజు రూ.5.85 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో విశ్వక్ సేన్ గత చిత్రాలైన 'దాస్ కా ధమ్కీ' (రూ.5.3 కోట్లు), 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (రూ.5.2 కోట్లు), 'గామి' (రూ.4 కోట్లు) తొలి రోజు రికార్డులను 'ఈఎన్‌ఈ రిపీట్' అధిగమించింది. విష్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
ఓవర్సీస్‌లోనూ గ్యాంగ్ హవా
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యూఎస్ఏ (USA)లో ప్రీమియర్స్, డే 1 వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. తొలి రోజు ఓవర్సీస్ నుంచి సుమారు రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
వీకెండ్లో మరింత జోరు!
{{/usCountry}}తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యూఎస్ఏ (USA)లో ప్రీమియర్స్, డే 1 వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. తొలి రోజు ఓవర్సీస్ నుంచి సుమారు రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
వీకెండ్లో మరింత జోరు!
{{/usCountry}}విశ్వక్ సేన్, అభినవ్, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను గ్యాంగ్ మళ్లీ తెరపై చేసిన అల్లరి, నాస్టాల్జిక్ మూమెంట్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లకు యూత్ క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈఎన్ఈ రిపీట్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ నంబర్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.