ENE Repeat OTT: టాలీవుడ్ కల్ట్ బడ్డీ కామెడీ మూవీ 'ఈ నగరానికి ఏమైంది'కి దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) గురువారం (నవంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో నవ్వుల విందు పంచుతున్నారు.

థియేటర్లలో ఈ సినిమా సందడి మొదలైన రోజే, దీనికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు, నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న ఆసక్తికర ఒప్పందం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు 4 వారాల థియేట్రికల్ విండో ఒప్పందం ప్రకారం, డిసెంబర్ మూడో వారంలో ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
'ఈఎన్ఈ రిపీట్' (ఈ నగరానికి ఏమైంది 2) పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మేకర్స్, నెట్‌ఫ్లిక్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి రానుంది.
నవంబర్ 19న థియేట్రికల్ రిలీజ్ కావడంతో, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ మూడో వారంలో (డిసెంబర్ 17 లేదా 18 తేదీల్లో) 'ఈఎన్ఈ రిపీట్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాక్సాఫీస్ రన్‌ను బట్టి నెట్‌ఫ్లిక్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.
బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ క్రేజీ డీల్
ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ ఒక వినూత్నమైన 'పెర్ఫార్మెన్స్ లింక్డ్' ఆఫర్ ఇచ్చింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బ్రేక్-ఈవెన్ కోసం రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.
{{/usCountry}}ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ ఒక వినూత్నమైన 'పెర్ఫార్మెన్స్ లింక్డ్' ఆఫర్ ఇచ్చింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బ్రేక్-ఈవెన్ కోసం రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.
{{/usCountry}}మొదట నెట్‌ఫ్లిక్స్ బేసిక్ రేట్ కింద రూ.11 కోట్లకు డిజిటల్ రైట్స్ లాక్ చేసింది. ఒకవేళ థియేటర్లలో ఈ సినిమా రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే రూ.16 కోట్లు, రూ.40 కోట్లు దాటితే రూ.19 కోట్లు ఇవ్వనుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అధిగమిస్తే, బేసిక్ రేట్‌కు రెట్టింపు అంటే ఏకంగా రూ.22 కోట్లు చెల్లించేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈఎన్ఈ రిపీట్ విశేషాలు
ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ ఎర్రబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విశ్వక్ సేన్ గ్యాంగ్‌తో పాటు అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, కరుణ కుమార్, ప్రియదర్శిని రామ్, మహేశ్ భాస్కర్ కీలక పాత్రల్లో మెరిశారు.
మొదటి భాగానికి ప్రాణం పోసిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కు కూడా అద్భుతమైన సంగీతం అందించగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. థియేటర్లలో యూత్‌ను ఊపేస్తున్న ఈ గ్యాంగ్, డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ వేదికగానూ రికార్డు వ్యూస్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.