...
...
Next Story

ఈటీవీ విన్ మరో ఒరిజినల్ ఫిల్మ్.. రవిబాబు దర్శకత్వంలో.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆ రోజే.. వెరైటీ టైటిల్ తో కామెడీ మూవీ

వరుసగా ఒరిజినల్ ఫిల్మ్, సిరీస్ లతో సత్తాచాటుతోంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్. ఇప్పుడు మరో స్పెషల్ సినిమాతో డిజిటల్ స్ట్రీమింగ్ లో రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కామెడీ మూవీకి రవిబాబు డైరెక్టర్ కావడం విశేషం.

Published on: Nov 1, 2025, 21:32:05 IST
Advertisement

ఈటీవీ విన్.. వరుసగా ఒరిజినల్ సిరీస్, సినిమాలతో ఓటీటీలో రచ్చ లేపుతోంది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్, కానిస్టేబుల్ కనకం సిరీస్ లు.. అనగనగా, లిటిల్ హార్ట్స్ సినిమాలతో అదరగొట్టింది ఈటీవీ విన్. ఇదే క్రమంలో ఇప్పుడు మరో ఒరిజినల్ మూవీని రిలీజ్ చేయనుంది. ఫుల్ కామెడీ జానర్ లో సినిమాను తీసుకు రానుంది. ఈ మూవీ టైటిల్ ను ఇవాళ (నవంబర్ 1) అనౌన్స్ చేశారు.

ఏనుగుతొండం ఘటికాచలం ఓటీటీ

ఓటీటీలోకి ఈటీవీ విన్ కొత్త సినిమా (x/etvwin)
ఓటీటీలోకి ఈటీవీ విన్ కొత్త సినిమా (x/etvwin)

ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్ గా ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రాబోతోంది. ఈ సినిమాకు రవిబాబు డైరెక్టర్ కావడం విశేషం. అల్లరి నుంచి మొదలు పార్టీ, నచ్చావులే, అమరావతి, మనసారా, అవును, అదుగో, ఆవిరి, క్రష్ లాంటి సినిమాలకు రవిబాబు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎన్నో తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఈటీవీ విన్ కోసం ఏనుగుతొండం ఘటికాచలం మూవీ సిద్ధమైంది.

రిలీజ్ డేట్

ఈటీవీ విన్ ఓటీటీలో ఏనుగుతొండం ఘటికాచలం మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ డేట్ ను శనివారం ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. నవంబర్ 13న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని ఆడియన్స్ కోసం రెడీ చేశారు. దీనికి స్టోరీ కూడా రవిబాబుదే. హాట్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

కామెడీ ఎంటర్ టైనర్

టైటిల్ నే డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు రవిబాబు. ఏనుగుతొండం ఘటికాచలం మూవీ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అయింది. ఈ సినిమాలో నరేష్ వీకే, వర్షిణి సౌందరరాజన్, అలీ, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణ భ‌గ‌వాన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్ చూస్తేనే ఇది కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది.

ఒరిజినల్ కంటెంట్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks