Etv Win OTT: ఓటీటీ ధమాకా.. ఆయుధ పూజనాడు తమ ఆయుధాలు బయటకు తీసిన ఈటీవీ విన్ ఓటీటీ.. ఇక 2 నెలల కొత్త మూవీస్, సిరీస్ జాతరే

Etv Win OTT: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' ఆయుధ పూజ పండుగ సందర్భంగా ప్రేక్షకులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. రాబోయే రెండు నెలల పాటు ఓటీటీ ప్రియులను అలరించేలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడిన స్పెషల్ లైనప్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Published on: Oct 19, 2026, 15:29:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Etv Win OTT: తెలుగు ఓటీటీ రంగంలో స్వచ్ఛమైన ప్రాంతీయ కంటెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) దసరా పండుగ వేళ ప్రేక్షకులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఆయుధ పూజను పురస్కరించుకుని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అనౌన్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది.

Etv Win OTT: ఓటీటీ ధమాకా.. ఆయుధ పూజనాడు తమ ఆయుధాలు బయటకు తీసిన ఈటీవీ విన్ ఓటీటీ.. ఇక 2 నెలల కొత్త మూవీస్, సిరీస్ జాతరే
Etv Win OTT: ఓటీటీ ధమాకా.. ఆయుధ పూజనాడు తమ ఆయుధాలు బయటకు తీసిన ఈటీవీ విన్ ఓటీటీ.. ఇక 2 నెలల కొత్త మూవీస్, సిరీస్ జాతరే

సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ ఓటీటీ ఓ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. "ఈ ఆయుధ పూజకు మా తదుపరి 'ఆయుధాల'ను ఆవిష్కరిస్తున్నాం. రాబోయే రెండు నెలల పాటు మీ వినోదానికి ఎలాంటి లోటు ఉండదు. పూర్తి వివరాల కోసం వేచి చూడండి" అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో తెలుగు ఓటీటీ ప్రియులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

రాబోయే 2 నెలలకు గ్రాండ్ లైనప్

దసరా, దీపావళి వరుస పండుగల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఈటీవీ విన్ ఈసారి భారీ ప్లానింగ్‌తో ముందుకు వస్తోంది. గతంలో '90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్', 'వలరి', 'కనకరాజు' వంటి సరికొత్త కథాంశాలతో వచ్చి సూపర్ హిట్లు అందుకున్న ఈ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు మరిన్ని ఒరిజినల్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను లైన్‌లో పెట్టింది.

ఈ ఆయుధ పూజ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌లో భాగంగా రాబోయే నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ ట్వీట్ కు జోడించిన స్పెషల్ పోస్టర్ లో ఈ రెండు నెలల పాటు రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లన్నింటినీ చూడొచ్చు.

ఈటీవీ విన్ లోకి అడుగుపెట్టనున్న మూవీస్, సిరీస్ ఇవే

ఈటీవీ విన్ రిలీజ్ చేసిన తాజా పోస్టర్ లో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మధ్యే థియేటర్లలో రిలీజైన తెల్ల కాగితం మూవీ కూడా ఈటీవీ విన్ లోకే రానున్నట్లు తేలిపోయింది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఇక మరొక మూవీ బాలు గీత కూడా అక్టోబర్ 15 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇక మెల్‌బోర్న్ మేట్స్ అనే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కూడా ఈ ఓటీటీలోకి రాబోతోంది.

మరోవైపు జేడీ చక్రవర్త నటించిన మరో ప్రాజెక్ట్ #డీఎం కూడా తమ ఓటీటీలోకి రానున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. అటు సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మరో క్రేజీ మూవీ ఇంకా ఏం అనుకోలేదు కూడా రాబోయే రోజులలో రిలీజ్ కానున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More