మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్న డైరెక్టర్
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే నేరుగా ఓ తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాతో నాలుగేళ్ల తర్వాత డైరెక్టర్ రవి బాబు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది.
ఈవారం ఓటీటీలోకి వస్తున్న సినిమాల్లో తెలుగు కామెడీ ఎంటర్టైనర్ అయిన ఏనుగు తొండం ఘటికాచలం కూడా ఉంది. రవి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.

ఏనుగు తొండం ఘటికాచలం ఓటీటీ రిలీజ్
టాలీవుడ్ లో డైరెక్టర్ రవి బాబు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ, కామెడీతోపాటు థ్రిల్లర్ సినిమాలనూ తీస్తూ వెళ్తున్నాడు. అయితే నాలుగేళ్ల తర్వాత అతడు ఇప్పుడు మళ్లీ ఈ ఏనుగు తొండం ఘటికాచలం మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (నవంబర్ 13) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని బుధవారం ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ఏనుగు తొండం ఘటికాచలం.. ఎ విన్ ఒరిజినల్ ఫిల్మ్.. రవి బాబు రాసి, డైరెక్ట్ చేసిన మూవీ.. నవంబర్ 13 నుంచి కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాను కొన్నాళ్లుగా ఆ ఓటీటీ ప్రమోట్ చేస్తోంది.
ఏనుగు తొండం ఘటికాచలం గురించి..
నటుడు, డైరెక్టర్ అయిన రవి బాబు తన కెరీర్లో భిన్నమైన పాత్రలు పోషించడమే కాదు.. భిన్నమైన సినిమాలూ తీశాడు. అల్లరి, అనసూయ, అమరావతి, అవునులాంటి మూవీస్ తో పాపులర్ అయ్యాడు. చివరిగా నాలుగేళ్ల కిందట క్రష్ అనే మూవీ తీశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఏనుగు తొండం ఘటికాచలం సినిమా తీశాడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తోపాటు టీవీ యాంకర్ వర్షిణి సౌందరాజన్, పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులు నటించారు.
ఓ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీసినట్లు పోస్టర్ తోనే స్పష్టమవుతోంది. గత వారం ట్రైలర్ రిలీజ్ చేశారు. 65 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునే ఘటికాచలం అనే వ్యక్తి పాత్రలో నరేష్ నటించాడు. తన పెన్షన్, ఆస్తి కోసం చూస్తున్న ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకొని గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు ట్రైలర్ లో చూపిస్తారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


