Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ హీరోయిన్ తెలుగు థ్రిల్లర్..ఐఏఎస్ కావాలనుకునే అమ్మాయిని రేప్..8.2 రేటింగ్

Euphoria OTT: ధురంధర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సారా అర్జున్. ఈ భామ నటించిన లేటెస్ట్ తెలుగు సోషల్ డ్రామా థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో అత్యాచారానికి గురైన బాధితురాలిగా ఆమె నటించింది. 

Published on: Apr 2, 2026, 05:54:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సారా అర్జున్.. ఇప్పుడీ భామ పేరు తెలియని సినీ లవర్ ఉండడనే చెప్చొచ్చు. ధురంధర్ సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ భామ నటించిన ఓ తెలుగు సోషల్ డ్రామా థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. అదే ‘యుఫోరియా’ మూవీ. ఇందులో అత్యాచారానికి గురైన బాధితురాలిగా తన నటనతో సారా అర్జున్ ఆకట్టుకుంది.

ఓటీటీలోకి తెలుగు సినిమా (youtube)
ఓటీటీలోకి తెలుగు సినిమా (youtube)

యుఫోరియా ఓటీటీ

భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సోషల్ థ్రిల్లర్ ‘యుఫోరియా’ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 2) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ యుఫోరియాను తెరకెక్కించాడు.

మిక్స్ డ్ టాక్

యుఫోరియా మూవీ నెల రోజులు దాటిన తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఏప్రిల్ 2, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వచ్చింది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన, ఫుట్ పాత్ పై పడుకున్న వాళ్లపై నుంచి బైక్ వెళ్లడం లాంటి రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ యుఫోరియా సినిమాను తెరకెక్కించారు.

ఐఎండీబీ రేటింగ్

యుఫోరియా సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేపోయింది. అయితే దీనికి ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉండటం గమనార్హం. ఐఏఎస్ కావాలనుకునే అమ్మాయి రేప్ కు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే యుఫోరియా స్టోరీ. ఇందులో భూమిక చావ్లా, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మీనన్, రోహిత్ తదితరులు నటించారు. ఈ మూవీని గుణశేఖర్ ఫ్యామిలీ నిర్మించింది.

యుఫోరియా స్టోరీ

ధురంధర్ లాంటి హిట్ తర్వాత సారా అర్జున్ తెలుగులో చేసిన మూవీ యుఫోరియా. ఇందులో ఆమె చైత్ర క్యారెక్టర్ ప్లే చేసింది. ఓ రిచ్ ఫ్యామిలీకి చెందిన చైత్ర ఐఏఎస్ కావాలని కలలు కంటుంది. ఆ దిశగా ప్రిపేర్ అవుతుంది. అయితే ఓ రోజు ఫ్యామిలీ పర్మిషన్ తో ఓ పార్టీకి వెళ్తుంది.

అక్కడ వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చైత్రపై కన్నేస్తారు. కార్లో ఆమెను రేప్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కేసును సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఎలా సాల్వ్ చేశారు? ఇందులో వింధ్య (భూమిక) కోర్టుకు ఎందుకు వెళ్లింది? అనేది యుఫోరియా మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More