ఈ ఏడాది బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్ మూవీ ఇవే.. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు 2025 పూర్తి జాబితా ఇదీ
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు 2025లో బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్ ఒరిజినల్ మూవీ ఏవో తేలిపోయింది. సోమవారం (డిసెంబర్ 15) ముంబైలో ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. నెట్‌ఫ్లిక్స్ లోని బ్లాక్ వారెంట్ బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డు అందుకుంది.
ముంబై వేదికగా సోమవారం అంటే డిసెంబర్ 15న 6వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ (Filmfare OTT Awards 2025) ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో 'పాతాళ్ లోక్ సీజన్ 2', 'బ్లాక్ వారెంట్', 'ఖౌఫ్' వంటి వెబ్ సిరీస్‌లు.. 'గర్ల్స్ విల్ బీ గర్ల్స్', 'సెక్టార్ 36' వంటి సినిమాలు సత్తా చాటాయి. జైదీప్ అహ్లావత్, విక్రాంత్ మాస్సే, అనన్య పాండే వంటి వారు బ్లాక్ లేడీ ట్రోఫీలను అందుకున్నారు.

ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల పూర్తి జాబితా
ఓటీటీ కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ తారలు హాజరైన ఈ ఈవెంట్‌లో విజేతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వెబ్ సిరీస్ కేటగిరీ
ఈ విభాగంలో 'పాతాళ్ లోక్ 2', బ్లాక్ వారెంట్, 'ఖౌఫ్' సిరీస్‌లు ఎక్కువ అవార్డులను కైవసం చేసుకున్నాయి.
ఉత్తమ వెబ్ సిరీస్ (క్రిటిక్స్): పాతాళ్ లోక్ సీజన్ 2
ఉత్తమ దర్శకుడు (సిరీస్): నగేష్ కుకునూర్ (ది హంట్: ది రాజీవ్ గాంధీ అసోసినేషన్ కేస్)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): అనుభవ్ సిన్హా (IC 814: ది కాందహార్ హైజాక్)
ఉత్తమ దర్శకుడు (బ్లాక్ వారెంట్): విక్రమాదిత్య మోత్వానే బృందం
ఉత్తమ నటుడు (డ్రామా - మేల్): జైదీప్ అహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
ఉత్తమ నటుడు (డ్రామా - ఫిమేల్): మోనికా పన్వర్ (ఖౌఫ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ - మేల్): జహాన్ కపూర్ (బ్లాక్ వారెంట్)
ఉత్తమ నటి (క్రిటిక్స్ - ఫిమేల్): రసిక దుగల్ (శేఖర్ హోమ్)
ఉత్తమ సహాయ నటుడు (డ్రామా): రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)
ఉత్తమ సహాయ నటి (డ్రామా): తిలోత్తమ షోమ్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
కామెడీ విభాగం
ఉత్తమ వెబ్ సిరీస్ (కామెడీ): రాత్ జవానీ హై
ఉత్తమ నటుడు (కామెడీ - మేల్): వరుణ్ సోబ్తి (రాత్ జవాన్ హై), స్పర్ష్ శ్రీవాస్తవ (దుపహియా)
ఉత్తమ నటి (కామెడీ - ఫిమేల్): అనన్య పాండే (కాల్ మీ బే)
ఉత్తమ సహాయ నటుడు (కామెడీ): వినయ్ పాఠక్ (గ్రామ్ చికిత్సాలయ్)
ఉత్తమ సహాయ నటి (కామెడీ): రేణుక షహానె (దుపహియా)
టెక్నికల్ అవార్డ్స్
ఉత్తమ కథ & స్క్రీన్ ప్లే: పాతాళ్ లోక్ సీజన్ 2
ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సౌండ్ డిజైన్: ఖౌఫ్
వెబ్ ఒరిజినల్ ఫిల్మ్స్ కేటగిరీ
సినిమాల విభాగంలో 'సెక్టార్ 36', 'గర్ల్స్ విల్ బీ గర్ల్స్' చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను గెలుచుకున్నాయి.
ఉత్తమ చిత్రం (వెబ్ ఒరిజినల్): గర్ల్స్ విల్ బీ గర్ల్స్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బోమన్ ఇరానీ (ది మెహతా బాయ్స్)
ఉత్తమ దర్శకుడు: షుచి తలాటి (గర్ల్స్ విల్ బీ గర్ల్స్)
ఉత్తమ నటుడు (మేల్): అభిషేక్ బెనర్జీ (స్టోలెన్)
ఉత్తమ నటి (ఫిమేల్): సాన్యా మల్హోత్రా (మిసెస్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ - మేల్): విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)
ఉత్తమ నటి (క్రిటిక్స్ - ఫిమేల్): ప్రీతి పాణిగ్రాహి (గర్ల్స్ విల్ బీ గర్ల్స్)
ఉత్తమ సహాయ నటుడు: దీపక్ డోబ్రియాల్ (సెక్టార్ 36)
ఉత్తమ సహాయ నటి: కని కుసృతి (గర్ల్స్ విల్ బీ గర్ల్స్)
షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీ
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (పీపుల్స్ ఛాయిస్): డివోర్స్ (దర్శకుడు: రాఘవ్ కన్సల్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (ఫిక్షన్): అయేషా
ఉత్తమ నటి: ఫాతిమా సనా షేక్ (అయేషా)
ఉత్తమ నటుడు: అయాన్ ఖాన్ (చష్మా)
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


