ఓటీటీల్లోకి ఈ ఏడాది వచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. వీటిని మిస్ కావద్దు.. అదరగొట్టిన కొత్త సీజన్లు
ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. వీటిలో ఇప్పటి వరకూ మీరు చూడకపోయిన ఉన్న సిరీస్ ఉంటే వెంటనే చూసేయండి. కొత్త ఒరిజినల్స్ తోపాటు కొత్త సీజన్లతో వచ్చిన సిరీస్ కూడా ఆకట్టుకున్నాయి.
ఈ ఏడాది చివరికి వచ్చేశాం. 2025లో ఓటీటీలో అద్భుతమైన వెబ్ సిరీస్‌లు అలరించాయి. హారర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్లలో ఆకట్టుకున్న 2025 బెస్ట్ వెబ్ సిరీస్‌ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మరో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేలోపు, 2025లో మనల్ని మెస్మరైజ్ చేసిన, తప్పక చూడాల్సిన హిందీ వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడ చూడండి.

1. భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ - అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
దేశంలోని మొట్టమొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ (ఘోస్ట్ హంటర్) గౌరవ్ తివారీ వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ఇది. గౌరవ్ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే జర్నలిస్ట్‌గా కల్కి కోచ్లిన్, గౌరవ్‌గా కరణ్ టాకర్ నటించారు. ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడొచ్చు.
2. సింగిల్ పాపా - నెట్‌ఫ్లిక్స్
బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము నటించిన హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా. బాధ్యత లేని భర్త అని భార్య వదిలేస్తే.. తాను ఎంత బాధ్యతగలవాడినో నిరూపించుకోవడానికి ఒక బిడ్డను దత్తత తీసుకునే యువకుడి కథ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
3. డబ్బా కార్టెల్- నెట్‌ఫ్లిక్స్
షబానా అజ్మీ, జ్యోతిక, షాలిని పాండే నటించిన క్రైమ్ డ్రామా ఇది. టిఫిన్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే మహిళల గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. వైవిధ్యమైన కథనం కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
4. రియల్ కాశ్మీర్ ఫుట్ బాల్ క్లబ్ - సోనీ లివ్
కశ్మీర్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. మానవ్ కౌల్, జీషన్ అయ్యూబ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో అడ్డంకుల మధ్య ఫుట్‌బాల్ క్లబ్ స్థాపించే అండర్‌డాగ్స్ కథ ఇది. సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
5. ద హంట్: రాజీవ్ గాంధీ అసోసినేషన్ కేస్ - సోనీ లివ్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణ ఆధారంగా సాగే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. రాజకీయాలు, మీడియా మానిప్యులేషన్‌ను చూపే పొలిటికల్ థ్రిల్లర్. అమిత్ సియాల్ సిట్ (SIT) చీఫ్‌గా నటించాడు. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
6. స్పెషల్ ఆప్స్ 2 - జియోహాట్‌స్టార్
జియోహాట్‌స్టార్ లోకి రెండో సీజన్ తో వచ్చింది స్పెషల్ ఆప్స్ వెబ్ సిరీస్. కే కే మేనన్ మరోసారి హిమ్మత్ సింగ్ పాత్రలో అదరగొట్టాడు. ఈసారి కథ విదేశాల్లో ఉంటూ ఇండియాపై సైబర్ వార్ చేసే ఓ స్వదేశీ విలన్ చుట్టూ తిరుగుతుంది.
7. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 - ప్రైమ్ వీడియో
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా నాలుగేళ్ల తర్వాత ఈసారి ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. కొత్త విలన్ తోపాటు ఈసారి కథ నార్త్ ఈస్ట్ ఇండియాలో జరుగుతుంది. శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్‌పాయీ తిరిగి వచ్చాడు.
8. పంచాయత్ 4 - ప్రైమ్ వీడియో
ఇక ప్రైమ్ వీడియోలోకే ఈసారి పంచాయత్ సీజన్ 4 స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ కొత్త సీజన్ మొత్తం ఫులేరా ఊరి ఎన్నికలు, ఎత్తులు, పైఎత్తుల చుట్టూ తిరుగుతుంది. వచ్చే ఏడాది చివరిదైన ఐదో సీజన్ రాబోతోంది.
9. బ్లాక్ వారెంట్ - నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన బ్లాక్ వారెంట్ కూడా మంచి థ్రిల్ పంచింది. బికినీ కిల్లర్ గా పేరుగాంచిన ఛార్లెస్ శోభరాజ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. తొలి సీజన్ ఈ ఏడాది వచ్చింది.
10. కంఖజురా - సోనీ లివ్
మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కంఖజురా. ఈ సిరీస్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రోషన్ మాథ్యూ నటనకు ప్రశంసలు దక్కాయి. సోనీ లివ్ లో చూడొచ్చు.
ఇవే కాకుండా.. ప్రైమ్ వీడియోలోని హారర్ థ్రిల్లర్ ఖౌఫ్, నెట్‌ఫ్లిక్స్ లోని ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, ప్రైమ్ వీడియలోని పాతాళ్ లోక్ సీజన్ 2 కూడా మిస్ కాకుండా చూడాల్సినవే.














