ఒకే ఓటీటీలోని రెండు వెబ్ సిరీస్‌లకు అదిరిపోయే రెస్పాన్స్.. ఒకటి క్రైమ్ థ్రిల్లర్, మరొకటి స్పోర్ట్స్ డ్రామా..
ఒకే ఓటీటీలోకి ఈమధ్యే వచ్చిన రెండు వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఒకటి తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్ ఒకటి కాగా.. మరొకటి హిందీ స్పోర్ట్స్ డ్రామా రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.
ఓటీటీలో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ లేదంటే ఓ స్పోర్ట్స్ డ్రామా కోసం చూస్తున్నారా? అయితే ఇవి రెండూ మీకు ఒకే ఓటీటీలో దొరుకుతాయి. సోనీ లివ్ ఓటీటీలోకి గత వారం వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్, ఈవారం వచ్చిన హిందీ స్పోర్ట్స్ డ్రామా ది రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఈ సిరీస్ ఏంటి? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ వెబ్ సిరీస్
సోనీ లివ్ ఓటీటీలోకి సోమవారం (డిసెంబర్ 8) వచ్చిన స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్ రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్. ఫుట్‌బాల్ లో కశ్మీర్ కు పునర్‌వైభవం తేవాలని కలలు కనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కశ్మీర్ కు చెందిన షమీమ్ మెహరాజ్, స్థానిక వ్యాపారవేత్త సందీప్ చాటో అనే వ్యక్తులు 2016లో ఎలా కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు చేసి, కశ్మీర్ యువతను మళ్లీ ఫుట్‌బాల్ వైపు మళ్లించారో కళ్లకు కట్టినట్లు చూపించే వెబ్ సిరీస్ ఇది.
ఇందులో మహ్మద్ జీషాన్ ఆయుబ్, మానవ్ కౌల్ ఆ ఇద్దరి పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐఎండీబీలోనూ 8.4 రేటింగ్ రావడం విశేషం. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్
ఇక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రమ్ పురింధవన్ కూడా సోనీ లివ్ ఓటీటీలోనే గత శుక్రవారం (డిసెంబర్ 5) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ 12 ఏళ్ల పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. సాధారణ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా ఓ నేరం, దాని చుట్టూ జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాకుండా.. ఆ నేరం గురించి తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయతలో ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఓ సామాన్యుడు సాగించే ప్రయాణమే ఈ కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఇచ్చే ట్విస్టులు, క్లైమ్యాక్స్ ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


