ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఇదే.. టాప్ 10లో క్రైమ్ థ్రిల్లర్స్ హవా.. మీరు ఎన్ని చూశారు?
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ టాప్ 10 జాబితాను ఐఎండీబీ బుధవారం (డిసెంబర్ 10) రిలీజ్ చేసింది. వీటిలో చాలా వరకు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకే చోటు దక్కింది. ఇక టాప్ లో ఆర్యన్ ఖాన్ డైెరెక్ట్ చేసిన బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ చోటు దక్కించుకుంది.
ఈ ఏడాది ఓటీటీ వెబ్ సిరీస్ ప్రియులకు పండగనే చెప్పాలి. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'స్పెషల్ ఆప్స్', 'పంచాయత్' వంటి భారీ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. అతడు డైరెక్ట్ చేసిన తొలి వెబ్ సిరీస్ 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఐఎండీబీ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఐఎండీబీ టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్ ఇవే
బుధవారం (డిసెంబర్ 10) నాడు IMDb సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 ఇండియన్ వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పదింటిలో ఏడు క్రైమ్ థ్రిల్లర్లే కావడం.. ఆరు సిరీస్‌లు కొత్త సీజన్లతో వచ్చినవి కావడం విశేషం. వీటిలో తొలి స్థానంలో ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ ఉంది.
ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ (ఆర్యన్ ఖాన్) - నెట్‌ఫ్లిక్స్
బ్లాక్ వారెంట్ (జహాన్ కపూర్) - నెట్‌ఫ్లిక్స్
పాతాళ్ లోక్: సీజన్ 2 (జైదీప్ అహ్లావత్) - ప్రైమ్ వీడియో
పంచాయత్: సీజన్ 4 (జితేంద్ర కుమార్) - ప్రైమ్ వీడియో
మండల మర్డర్స్ (వాణీ కపూర్) - నెట్‌ఫ్లిక్స్
ఖౌఫ్ - ప్రైమ్ వీడియో
స్పెషల్ ఆప్స్: సీజన్ 2 (కే కే మీనన్) - జియోహాట్‌స్టార్
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ - నెట్‌ఫ్లిక్స్
ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 (మనోజ్ బాజ్‌పేయి) - ప్రైమ్ వీడియో
క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మ్యాటర్ (పంకజ్ త్రిపాఠి) - జియోహాట్‌స్టార్
ఇండస్ట్రీని షేక్ చేయాలనుకున్నా: ఆర్యన్ ఖాన్
తన తొలి వెబ్ సిరీస్‌కే ఇంతటి గుర్తింపు రావడంపై ఆర్యన్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పిచ్చి, మ్యాజిక్, అల్లరి, ఆశయాలను సెలబ్రేట్ చేయడమే తన లక్ష్యమని అతడు చెప్పాడు.
"మా వెబ్ సిరీస్ ఐఎండీబీలో అగ్రస్థానంలో నిలవడం చూస్తుంటే, మేము ఏదైతే అనుకున్నామో అది సాధించినట్లు అనిపిస్తోంది. మేము 'రూమ్ షేక్' చేయాలనుకున్నాం. అందరూ దీని గురించే మాట్లాడుకునేలా చేయాలనుకున్నాం. ఎలాంటి మొహమాటం లేకుండా నిజాయితీగా కథ చెప్పాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇంతలా ఆదరించారు. మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, సోషల్ మీడియాలో చర్చలు చూస్తుంటే.. ఇది కేవలం వీకెండ్ వాచ్‌గా మిగిలిపోలేదు, ప్రజల సంస్కృతిలో భాగమైందని అర్థమవుతోంది. ఇది ఆరంభం మాత్రమే" అని ఆర్యన్ ఒక ప్రకటనలో తెలిపాడు.
బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి..
సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఒక సెటైరికల్ కామెడీ. పరిశ్రమలో అంతర్గత కుమ్ములాటలు, బయటి వ్యక్తులు నిలదొక్కుకోవడానికి పడే పాట్లు, నెపోటిజం వంటి అంశాలను ఇందులో చూపించారు. బాబీ డియోల్, రాఘవ్ జుయల్, లక్ష్య, సాహెర్ బాంబా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


