తెలుగులో ఓటీటీలోకి వచ్చిన రష్మిక మందన్న హిందీ హారర్ థ్రిల్లర్-అందమైన రక్త పిశాచిగా నేషనల్ క్రష్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ థామా ఓటీటీ ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రష్మిక రక్త పిశాచిగా నటించింది. 

Published on: Dec 16, 2025, 12:27:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఫస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ థామా. హిందీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

రష్మిక మందన్న (x)
రష్మిక మందన్న (x)

థామా ఓటీటీ

రష్మిక మందన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రైమ్ వీడియోలో ఎలాంటి రెంట్ చెల్లించకుండానే ఈ నేషనల్ క్రష్ లేటెస్ట్ మూవీ థామా చూసేయచ్చు. ఈ హారర్ థ్రిల్లర్ ఇవాళ (డిసెంబర్ 16) నుంచి ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. నిజానికి డిసెంబర్ 2న థామా మూవీ ఓటీటీలో రిలీజైంది. కానీ అప్పుడు రెంట్ విధానంలోనే స్ట్రీమింగ్ అయింది. అంటే ప్రైమ్ వీడియో యూజర్లు కూడా రెంట్ కోసం మనీ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెంట్ కాకుండా సాధారణంగానే స్ట్రీమింగ్ అవుతోంది.

బాక్సాఫీస్ హిట్

మడాక్ ఫిల్మ్స్ వారి తాజా హారర్ కామెడీ 'థామా' ఇప్పుడు స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ఈ చిత్రం మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఇండియాలో రూ.135 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.187 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

మాడాక్ హారర్ కామెడీ

మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU)లో భాగంగా థామా తెరకెక్కింది. ఈ యూనివర్స్ లో 'స్త్రీ' చిత్రాలు, 'ముంజ్యా', 'భేడియా' కూడా ఉన్నాయి. 'థామా' అనేది ఒక పౌరాణిక ప్రపంచంలో సెట్ చేసిన సూపర్ నాచురల్ హారర్-కామెడీ చిత్రం. ఈ చిత్రం మానవాళికి చివరి ఆశ అయిన ఆలొక్ (ఆయుష్మాన్), చీకటితో నిండిన రాజ్యంలో తిరిగే ఒక మాయా జీవి అయిన తడ్కా (రష్మిక) కథను చెబుతుంది.

థామా స్టోరీ

హారర్ థ్రిల్లర్ థామా.. దినేష్ విజన్ మడాక్ ఫిల్మ్స్, అమర్ కౌశిక్ బ్యానర్‌లపై నిర్మించిన మూవీ. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు ఈ చిత్రంలో పరేష్ రావల్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు, వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, నోరా ఫతేహి, మలైకా అరోరాలు ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించారు.

అలోక్ ఓ జర్నలిస్ట్. పర్వత ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎలుగు బంటి నుంచి అతణ్ని తడ్కా (రష్మిక) కాపాడుతుంది. ఆ తర్వాత అలోక్ కూడా బేతాళుడిగా మారతాడు. మరి తడ్కా కథ ఏంటీ? అలోక్ ఎందుకు బేతాళుడిగా మారాడా? థామా ఎవరు? అన్నది సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More