Garividi Lakshmi: నిర్మాత చిన్న పాప, నా కథను మూవీగా ఎందుకు తీయాలనిపించిందో: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ కామెంట్స్
Garividi Lakshmi Comments In Movies Success Meet: తెలుగులో వచ్చిన సినిమా గరివిడి లక్ష్మి. బుర్రకథ కళాకారిణి, జానపద గాయని గరివిడి లక్ష్మీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో గరివిడి లక్ష్మీ, నిర్మాత విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Garividi Lakshmi Comments In Movies Success Meet: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని, బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు.

గరివిడి లక్ష్మిగా హీరోయిన్ ఆనంది
గరివిడి లక్ష్మి పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఆనంది నటించిన విషయం తెలిసిందే. గౌరి నాయుడు జమ్ము గరివిడి లక్ష్మి సినిమాకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన గరివిడి లక్ష్మి సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
గరివిడి లక్ష్మీకి సన్మానం
ప్రస్తుతం థియేటర్లలో గరివిడి లక్ష్మి సినిమా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. గరివిడి లక్ష్మి సక్సెస్ వేడుకలో గాయని గరివిడి లక్ష్మీకి మేకర్స్ సన్మానం చేశారు. అనంతరం గరివిడి లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నా కథ కోసం చాలా తిరిగారు
సక్సెస్ మీట్లో జానపద కళాకారిణి గరివిడి లక్ష్మీ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నా కథ కోసం డైరెక్టర్ గౌరీ నాయుడు చాలా తిరిగాడు. తను పడిన శ్రమ చూసి నా కథ చెప్పాను. అలా చెప్పినందుకు ఈ రోజు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు" అని అన్నారు.
బుర్రకథలో నాకు పేరుంది
"నేను బుర్రకథ ఆడాను. బుర్రకథలో నాకు పేరు ఉంది. కానీ, ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. నిర్మాత కృతి గారు చిన్న పాప. తనకు నా కథను ఎందుకు తీసుకోవాలనిపించిందో తెలియదు. నా కథను సినిమాగా చేసినందుకు, సినిమా చూసిన అందరికీ ధన్యవాదాలు" అని గరివిడి లక్ష్మీ చెప్పారు.
మంచి అవకాశాలు రావాలని
"ఇంకా చూడని వాళ్లు కూడా సినిమాను చూడండి. ఈ సినిమాను చూసి మీరందరూ మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గౌరీ నాయుడుకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను" అని బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ కోరారు.
నాలాగే చేసిందని చెబుతున్నారు
"మా ఆర్టిస్టులందరూ కూడా సినిమా కోసం కష్టపడి పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆనందికి ఇంకా మంచి పేరు రావాలి. ఈ సినిమా చూసిన వాళ్లందరూ కూడా నాలాగే చేసిందని చెబుతుంటే ఆనందంగా అనిపించింది" అని గరివిడి లక్ష్మీ పేర్కొన్నారు.
టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు సినిమా ప్రజల్లోకి వెళ్లడానికి, రిలీజ్ తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ రావడానికి మీడియా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆడియన్స్ సినిమాను ఎంతో అద్భుతంగా ఆదరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


