Sridevi Haiku: కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ హైకూ.. ఆమె కళ్లతోనే ఏ భాష అయినా మాట్లాడగలదన్న డైరెక్టర్ రామ్ జగదీష్
Haiku Pre Release Press Meet: కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల తొలిసారిగా నటించిన తమిళ మూవీ హైకూ. ఏగన్ హీరోగా చేసిన ఈ సినిమాకు చిన్నసామి దర్శకత్వం వహించారు. తాజాగా ఇవాళ హైకూ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్, శ్రీదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Haiku Pre Release Press Meet: తెలుగులో సూపర్ హిట్ సాధించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటించిన తమిళ సినిమా హైకూ. ఈ సినిమాలో ఏగన్ హీరోగా చేయగా.. మరో హీరోయిన్గా ఫెమినా జార్జ్ నటించింది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్టైనర్గా హైకూ మూవీని రూపొందించారు.

హైకూ ప్రీ రిలీజ్ ఈవెంట్
యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న హైకూ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం (అక్టోబర్ 17) హైదరాబాద్‌లో హైకూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. "ఈ సినిమా నా హార్ట్‌కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్‌లో ఉన్నా, రిలేషన్ షిప్లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్‌లో ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు" అని అన్నారు.
నన్ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేశారు
"ఏగన్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం హ్యాప్పీగా అనిపించింది. నన్ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. మా టీం మొత్తం కూడా ఎంతో సహకరిస్తూ పని చేశారు. ఇది నా ఫస్ట్ డెబ్యూ. మీరంతా అక్టోబర్ 23న థియేటర్లో ఎంజాయ్ చేయండి" అని కోరారు హీరోయిన్ శ్రీదేవి అపల్ల.
హీరో ఏగన్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా క్లోజ్ టు మై హార్ట్. బాగా కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ యువరాజ్ చిన్నస్వామి నాకు పదేళ్లుగా తెలుసు. ఇప్పుడే మేమిద్దరం కలిసి సినిమా చేశాము. 200 పర్సెంట్ హైదరాబాద్‌లో మళ్లీ హైకూ సక్సెస్ మీట్లో కలుద్దాం" అని చెప్పుకొచ్చారు.
కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు
డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ.. "హైకూ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూకి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలీ (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సినిమా అవుట్ పుట్ చాలా ప్లెసెంట్గా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్ టు టీమ్" అని చెప్పారు.
కాలేజ్ లైఫ్ బ్యూటిఫుల్ థింగ్స్
"ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్‌లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్‌గా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలి. ఏగన్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ" అని రచయిత, నిర్మాత కోన వెంకట్ చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


