Kona Venkat: ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన ఏ సినిమా చూడొద్దు.. ఈ మాట అంటే చిరంజీవికి కోపం రావచ్చు: కోన వెంకట్

Kona Venkat: నిర్మాతగా మారిన ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా తాను నిర్మించిన బ్యాండ్‌మేళం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఈ సినిమా మీకు నచ్చకపోతే తాను రాయబోయే ఏ సినిమా చూడొద్దని సవాలు విసిరాడు.

Published on: Mar 24, 2026, 13:28:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kona Venkat: కోన వెంకట్ నిర్మించిన తాజా మూవీ బ్యాండ్‌మేళం. కోర్ట్ మూవీ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో తన మూవీ గురించి కోన ఓ రేంజ్ లో చెప్పాడు. ఈ సినిమా నచ్చకపోతే భవిష్యత్తులో తాను రాసే సినిమాలు చూడొద్దని అన్నాడు.

Kona Venkat: ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన ఏ సినిమా చూడొద్దు.. ఈ మాట అంటే చిరంజీవికి కోపం రావచ్చు: కోన వెంకట్
Kona Venkat: ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన ఏ సినిమా చూడొద్దు.. ఈ మాట అంటే చిరంజీవికి కోపం రావచ్చు: కోన వెంకట్

చిరంజీవిగారికి కోపం రావచ్చు కానీ..

బ్యాండ్‌మేళం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ మాట్లాడాడు. అందులో నానిలాగే అతడు కూడా సవాలు విసిరాడు. “నానిలాగే నేను కూడా చెప్తున్నా.. ఈ సినిమా తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మీరు మళ్లీ చూడొద్దు. అలాగని రాయడం మానేయను. మీకు నచ్చినంత వరకూ రాస్తూనే ఉంటా. ఈ సినిమాపై అంత కాన్ఫిడెన్స్ నాకు. ఈ మాట వింటే చిరంజీవిగారికి కోపం రావచ్చు. పొద్దునే ఫోన్ చేసి అలా ఎందుకన్నావ్ అని అంటారు. ఎందుకంటే నేను నెక్ట్స్ రాయబోయేది ఆయన సినిమాకే” అని కోన వెంకట్ అన్నాడు.

వీళ్లు నేను సంపాదించుకున్న ఆస్తులు

ఇక తాను ఇన్నాళ్లూ ఐటీ రిటర్న్స్ చేయకుండా దాచుకున్న ఆస్తులు వీళ్లు అంటూ పలువురు దర్శకుల పేర్లు కూడా అతడు చెప్పాడు. అందులో వీవీ వినాయక్, బాబీ, శివ నిర్వాణ, తాజాగా బ్యాండ్‌మేళం డైరెక్టర్ సతీష్ కూడా ఉన్నట్లు అతడు వెల్లడించాడు. వీళ్లంతా తాను సంపాదించుకున్న ఆస్తులని, తాను ఉన్నా లేకపోయినా వీళ్లు సినిమాను ముందుకు తీసుకెళ్తూనే ఉంటారని కోన వెంకట్ ఎమోషనల్ అయ్యాడు.

బ్యాండ్‌మేళం మూవీ గురించి..

'కోర్టు' సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్యాండ్ మేళం'. గత నెల 24న టీజర్ రిలీజ్ చేశారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదొక ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. పైగా హీరో, హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది.

సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ బ్యాండ్ మేళం సినిమాకు విలక్షణ సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చాడు. ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసిన ‘తిప్పుకుంటన్నావ్’ అనే మొదటి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించడం విశేషం.

ప్రేమ, సంగీతం, భావోద్వేగాలతో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ ట్రాక్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి కోర్ట్ మూవీలాగే ఈ బ్యాండ్ మేళంతోనూ రోషన్, శ్రీదేవి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మరో హిట్ కొడతారా అన్నది చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More