Funky OTT Release Date: అనుదీప్, విశ్వక్సేన్ ఫంకీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్
అనుదీప్, విశ్వక్సేన్ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ మూవీ ఫంకీ ఓటీటీ రిలీజ్ (Funky OTT Release Date) డేట్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ వచ్చే వారమే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా ఫంకీ. విశ్వక్సేన్, కయదు లోహర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైనా ఆ స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఫంకీ ఓటీటీ రిలీజ్ డేట్
లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఫంకీ మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆశించిన మేర బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయింది. కనీసం ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాను ఎలాంటి కథ లేకుండా కేవలం కామెడీ కోసమే తీసినట్లు నిర్మాత నాగవంశీ కూడా రిలీజ్ కు ముందు, తర్వాత చెప్పాడు. అయినా మూవీకి నెగటివ్ రివ్యూలే వచ్చాయి.
ఫంకీ మూవీ విశేషాలు
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఈ ఫంకీ (Funky). ఈ సినిమాలో బ్యూటిపుల్ అండ్ గ్లామర్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఫంకీ సినిమాను నిర్మించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందించాడు.
ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్, కయదు లోహర్‌తోపాటు వీకే నరేష్, వీటీవీ గణేష్, ఈశ్వరి రావు, సంపత్ రాజ్, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. యాక్టర్స్, టెక్నిషియన్స్ రెమ్యూనరేషన్ ఇతరత్రా ఖర్చులంతా కలిపి ఫంకీ సినిమాకు మొత్తంగా రూ. 15 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం. ఇండియాలో రూ.9 కోట్ల వరకు నెట్ వసూళ్లు సాధించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


