OTT Thriller: 41 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్.. అడుగడుగునా ట్విస్ట్ లు.. తెలుగులోనూ!

OTT Trending Thriller: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అదరగొడుతోంది. ఏకంగా 41 దేశాల్లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. 8 దేశాల్లో నంబర్ వన్ గా డిజిటల్ స్పేస్ ను శాసిస్తోంది. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ఏంటో ఓ లుక్కేయండి.

Published on: Sep 6, 2026, 18:19:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Trending Thriller: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) లీడ్ రోల్ ప్లే చేసిన ‘గాంధారి’ (Gandhari) మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఆల్-టైమ్ రికార్డులతో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. గ్లోబల్ నెట్‌ఫ్లిక్స్ చార్ట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది.

41 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్.. అడుగడుగునా ట్విస్ట్ లు.. తెలుగులోనూ!
41 దేశాల్లో ట్రెండింగ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్.. అడుగడుగునా ట్విస్ట్ లు.. తెలుగులోనూ!

గాంధారి ఓటీటీ

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ గాంధారి అదరగొడుతోంది. ఏకంగా 41 దేశాల్లో టాప్-10 ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా, ఇండియా సహా 8 దేశాల్లో నంబర్ 1 పొజిషన్‌ను కైవసం చేసుకుంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వంలో, కనికా ధిల్లాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీని షేక్ చేస్తోంది.

41 దేశాల్లో గ్లోబల్ ట్రెండింగ్

సెప్టెంబర్ 3న ఓటీటీలో రిలీజైన గాంధారి మూవీ.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ ఫిల్మ్స్ విభాగంలో వరల్డ్ వైడ్ 4వ స్థానానికి చేరుకుంది. ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా పరిధిలోని 41 దేశాలలో అత్యధికంగా వీక్షించిన టాప్-10 సినిమాల జాబితాలో గాంధారి చోటు దక్కించుకుంది.

8 దేశాల్లో నంబర్ 1

ఇక ఇండియాతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బహ్రెయిన్, ఒమన్, శ్రీలంక, మారిషస్ దేశాలలో గాంధారి చిత్రం నంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మిడిల్ ఈస్ట్‌లోని కువైట్, ఆఫ్రికన్ కంట్రీ నైజీరియాలో ఈ చిత్రం నంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

గాంధారి స్టోరీ ఇదే

గాంధారి మూవీ ఓ మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. బని (తాప్సి), గోకుల్ (ఇష్వాక్ సింగ్) భార్యాభర్తలు. ఆమెకు అయిదేళ్ల కూతురు మిస్తీ ఉంటుంది. ఈ ఫ్యామిలీ కలిసి సమ్మర్ హాలీడేస్ కోసం ట్రైన్ లో వేరే చోటుకు వెళ్తుంటారు. అప్పుడు జాయ్ పుర స్టేషన్ లో రైలు ఆగుతుంది.

ఆ జాయ్ పుర స్టేషన్ లో బని కళ్ల ముందే మిస్త్రీని ఎవరో మహిళ ఎత్తుకొని వెళ్లిపోతుంది. కూతురి కోసం పరుగెత్తే క్రమంలో బని కింద పడిపోతుంది. ఆమె తలకు దెబ్బ తగులుతుంది. ఇంకో షాకింగ్ ఏంటంటే బని కంటి చూపు కోల్పోతుంది.

కూతురి కోసం

అంధురాలిగా మారిన బని, గోకుల్ తమ కూతురు మిస్త్రీ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అక్కడే జాయ్ పురలో ఉండిపోతారు. అయితే అక్కడ అడుగడుగునా ఓ మిస్టరీ ఉంటుంది. అదిరిపోయే ట్విస్ట్ లు ఎదురవుతాయి. మరి బని తన కూతురు మిస్ట్రీని తిరిగి దక్కించుకుందా? అనేది గాంధారి మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More