...
...
Next Story

Today OTT Release: ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన తెలుగు లేటెస్ట్ బ‌యోపిక్‌.. ఏకంగా 9 ఐఎండీబీ రేటింగ్.. మస్ట్ వాచ్!

Today OTT Release: తెలుగులో బయోపిక్ లు అప్పుడప్పుడూ తెరకెక్కుతుంటాయి. తాజాగా టాలీవుడ్ లో అలాంటి ఓ బయోపిక్ వచ్చింది. మనసును తాకేలా, కనులను తడిపేలా ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇవాళ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Nov 26, 2026, 08:55:14 IST
Advertisement

Today OTT Release: ఉత్తరాంధ్ర జానపద గాయని, ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి బయోపిక్ గా తెలుగులో వచ్చిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. తెలుగమ్మాయి ఆనంది టైటిల్ లీడ్ ప్లే చేసిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ గుండె బరువెక్కించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది.

గరివిడి లక్ష్మి ఓటీటీ

ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన తెలుగు లేటెస్ట్ బ‌యోపిక్‌.. ఏకంగా 9 ఐఎండీబీ రేటింగ్.. మస్ట్ వాచ్!
ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన తెలుగు లేటెస్ట్ బ‌యోపిక్‌.. ఏకంగా 9 ఐఎండీబీ రేటింగ్.. మస్ట్ వాచ్!

తెలుగులో లేటెస్ట్ గా వచ్చిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. గురువారం (నవంబర్ 26) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. డిజిటల్ స్క్రీన్లపై ఓటీటీ ఆడియన్స్ కు ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చేందుకు ఈ మూవీ వచ్చేసింది. ఈ మూవీకి ఐఎండీబీలో 9 రేటింగ్ ఉండటం విశేషం.

స్టోరీ ఏంటంటే?

1980, 90ల్లో తన బుర్రకథలతో, జానపద పాటలతో ఉత్తరాంధ్ర ప్రజలను రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) ఉర్రూతలూగించింది. ఆమె నిజ జీవిత కథతో ఈ గరివిడి లక్ష్మి మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో గరివిడి లక్ష్మిగా ఆనంది జీవించేసిందని చెప్పొచ్చు.

చిన్నతనంలోనే అమ్మానాన్న ప్రేమకు గరివిడి లక్ష్మి దూరమవుతుంది. అలాగే చిన్న వయసులోనే జరిగిన పెళ్లి కూడా త్వరగానే పెటాకులవుతుంది. దీంతో గరివిడి లక్ష్మి జీవితం ఊహించని కష్టాల్లో కూరుకుపోతుంది. ఆ సమయంలో పాట, బుర్రకథ ఆమె జీవితంలోకి కొత్త వెలుగును తీసుకొస్తాయి.

10 వేలకు పైగా ప్రదర్శనలు

గరివిడి లక్ష్మి సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలా కారణాలున్నాయి. మస్ట్ వాచ్ అని చెప్పేందుకు బలమైన రీజన్స్ ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఆనంది నటన హైలైట్ అనొచ్చు. ఇప్పటివరకూ హీరోయిన్ పాత్రలు చేసినా పెద్దగా పేరు దక్కించుకోలేకపోయిన ఆనంది.. ఈ గరివిడి లక్ష్మి సినిమాలో మాత్రం వన్ విమెన్ షోతో అదరగొట్టింది.

ఉత్తరాంధ్ర యాసలో గుక్కతిప్పుకోకుండా బుర్రకథ చెప్తూ, జానపద పాటలు పాడుతూ గరివిడి లక్ష్మిగా ఆనంది మెప్పించింది. ఇక సినిమాలోని ఎమోషనల్ ట్విస్ట్ అండ్ టర్న్స్, మోటివేట్ చేసే సీన్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేందుకు గరివిడి లక్ష్మి మూవీ మంచి ఆప్షన్.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks