Geetu Mohandas: యశ్ కేవలం ఓ యాక్టర్ మాత్రమే కాదు.. అతనో ఎమోషన్.. కన్నీళ్లు కంట్రోల్ చేసుకున్న డైరెక్టర్ గీతూ మోహన్ దాస్

Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఫుల్ ఎమోషనల్ అయింది. తనను నమ్మి అవకాశం ఇచ్చిన యశ్ పట్ల కృతజ్ఞత తెలుపుతూ, 'నీ వల్ల కాదు' అన్న విమర్శకులకు తన పనితో సమాధానమిచ్చానని ఆమె చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 9, 2026, 08:25:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ కామెంట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

యష్ కేవలం ఓ యాక్టర్ మాత్రమే కాదు.. అతనో ఎమోషన్.. కన్నీళ్లు కంట్రోల్ చేసుకున్న డైరెక్టర్ గీతూ మోహన్ దాస్
యష్ కేవలం ఓ యాక్టర్ మాత్రమే కాదు.. అతనో ఎమోషన్.. కన్నీళ్లు కంట్రోల్ చేసుకున్న డైరెక్టర్ గీతూ మోహన్ దాస్

టాక్సిక్ ట్రైలర్

యశ్ ‘టాక్సిక్’ మూవీ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 8) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టాన్ని, కుటుంబం ఇచ్చిన సహకారాన్నిగీతూ గుర్తు చేసుకుంది.

అమ్మకు థ్యాంక్స్

"ముందుగా మా అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులు నా కూతురిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. అమ్మకు నేనెప్పుడూ థ్యాంక్స్ చెప్పాలనుకునేదాన్ని.. ఈ రోజు ఆ క్షణం వచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం" అని గీతూ తెలిపింది.

యశ్ కేవలం నటుడు కాదు

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి మాట్లాడుతూ గీతూ మోహన్ దాస్ చేసిన కామెంట్స్ అటు అభిమానులను, ఇటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

"యశ్ అంటే ఏంటో మీరందరూ ఇప్పటికే ట్రైలర్‌లో చూశారు. కానీ నా వరకైతే యశ్ కేవలం ఒక స్టార్ ప్రొడ్యూసర్, బ్రిలియంట్ యాక్టర్ లేదా కో-రైటర్ మాత్రమే కాదు. యశ్ అంటే ఒక ఎమోషన్.. డీప్ ఎమోషన్! ఈ సినిమా తర్వాత నా కెరీర్ ప్రయాణం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, యశ్‌లోని ఒక భాగాన్ని నేను ఎప్పటికీ నాతో తీసుకెళ్తాను. నన్ను నమ్మి ఈ సవాలుతో కూడిన అవకాశాన్ని ఇచ్చిన యశ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని గీతూ భావోద్వేగానికి లోనైంది.

'నీ వల్ల కాదు' అన్నవాళ్లకు

ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ బడ్జెట్, డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాను హ్యాండిల్ చేయగలదా అని ప్రారంభంలో వచ్చిన విమర్శలపై గీతూ గట్టిగా స్పందించింది.

"ఈ సినిమా ప్రారంభమైన సమయంలో 'ఇది నీ వల్ల కాదు' అని నా ముందే అన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నా సత్తా ఏంటో, నేను ఏంటో వాళ్లకు ఈ సినిమాతో నిరూపించి చూపించాను" అంటూ గీతూ చేసిన వ్యాఖ్యలు వేడుకకు హాజరైన అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్‌లో ఉంది.

బ్రేక్ చేసి

సాధారణంగా ఇండియన్ సినిమాలో రూ.500 కోట్ల దాకా బడ్జెట్ ఉండే పీరియడ్ మాస్/గ్యాంగ్‌స్టర్ చిత్రాలను పురుష దర్శకులే హ్యాండిల్ చేస్తారనే సాంప్రదాయ భావన ఉండేది. కానీ గీతూ మోహన్ దాస్ 'టాక్సిక్'తో ఆ సీలింగ్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది. యశ్ కేవలం హీరోగానే కాకుండా కో-రైటర్‌గా, ప్రొడ్యూసర్ గా ఆమె విజన్‌ను నమ్మి ఇంతటి స్వేచ్ఛను ఇవ్వడం, టాలీవుడ్ అండ్ బాలీవుడ్ చిత్రసీమల్లో లేడీ డైరెక్టర్ల స్థానాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే పరిణామమని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More