Ghattamaneni Jayakrishna: తాతయ్య ఉంటే బాగుండేది.. మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్‌ను.. జై బాబు: ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ

Ghattamaneni Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రమేష్ బాబు కొడుకు జ‌య‌కృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం మూవీ ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. తాజాగా నిర్వహించిన ఈ మూవీ ఈవెంట్లో తాతయ్య కృష్ణ, బాబాయ్ మహేష్ బాబు గురించి జ‌య‌కృష్ణ కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: May 31, 2026, 06:00:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ghattamaneni Jayakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అనే పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. సాహసమే శ్వాసగా సాగిన ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన వారసులు రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు మూడో తరం రాబోతుంది. దివంగత రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జ‌య‌కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

కృష్ణ, మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిన జయకృష్ణ (x)
కృష్ణ, మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిన జయకృష్ణ (x)

శ్రీను అండ్ మంగా ఈవెంట్

ఘట్టమనేని జ‌య‌కృష్ణ హీరోగా డెబ్యూ చేస్తున్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. దీనికి అజయ్ భూపతి డైరెక్టర్. సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా ఒక రోజు ముందు శనివారం (మే 30) రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో మూవీ టీమ్ ఓ ఈవెంట్ నిర్వహించింది. ‘శ్రీను అండ్ మంగా ఇంట్రడక్షన్’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో జ‌య‌కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

తాతయ్య ఉంటే

‘‘తాతయ్య జయంతి సందర్భంగా అందరినీ కలవడం సంతోషంగా ఉంది. తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయనపై అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఆయన ఉంటే బాగుండేది. నన్ను చూసి గర్వపడేవారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నా తన బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయని అనుకుంటున్నా. శ్రీనివాస మంగాపురం నా ఫస్ట్ మూవీ’’ అని జ‌య‌కృష్ణ చెప్పాడు.

ఛాలెంజింగ్ గా

‘‘డైరెక్టర్ అజయ్ భూపతి ఈ కథ వివరించినప్పుడు ఇందులోని ఎమోషన్స్, నా క్యారెక్టర్ లోని డెప్త్ నాకు నచ్చాయి. ఈ పాత్ర ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని అనుకున్నా. నటుడిగా నిరూపించుకునే ఛాన్స్ దొరుకుతుందని భావించా. నా ఫస్ట్ సినిమాకే అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ దొరకడం నా లక్’’ అని ఘట్టమనేని జ‌య‌కృష్ణ తెలిపాడు.

తాత, బాబాయ్ తో సినిమాలు

‘‘అశ్వినీదత్ మా తాతతో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ తో ‘రాజకుమారుడు’ సినిమాలు తీశారు. ఇప్పుడు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్. అజయ్ భూపతిని నాకు పరిచయం చేసిన నిర్మాత కిరణ్ కు థ్యాంక్స్. నాకు హీరో అవ్వాలనే ప్రేరణ కలిగించిన మా బంగారు తాతయ్య (ఆది శేషగిరిరావు)కు థ్యాంక్స్. రషా కేవలం నటి మాత్రమే కాదు. అద్భుతమైన వ్యక్తి కూడా’’ అని జ‌య‌కృష్ణ పేర్కొన్నాడు.

జై బాబు

‘‘మహేష్ బాబాయ్ కు నేను డై హార్డ్ ఫ్యాన్. ఇంతకుముందు కూడా చెప్పా. జై బాబు. నా మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ఆయనే లాంఛ్ చేశారు. నాకు ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. బాబాయ్ కు థ్యాంక్స్.ఈ సందర్భంగా మా నాన్న రమేష్ బాబును తలుచుకుంటున్నా’’2 అని జ‌య‌కృష్ణ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More