...
...
Next Story

Govinda: కూతురు వయసు అమ్మాయితో తిరుగుతున్నాడు సిగ్గు లేదు.. మీ షుగర్ డాడీ మంచి బట్టలూ వేసుకోలేదు: నటుడిపై భార్య కామెంట్

Govinda Affair: బాలీవుడ్ నటుడు గోవిందాపై అతని భార్య సునీతా అహూజా షాకింగ్స్ కామెంట్స్ చేసింది. తన కూతురి వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. సిగ్గులేదంటూ చాలా ఘాటుగా స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

Published on: Aug 14, 2026, 18:05:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Govinda Affair: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా తనకంటే చాలా చిన్న వయసున్న నటి కోమల్ రాణి స్వర్ణకార్‌తో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది. వీళ్లిద్దరి డేటింగ్ రూమర్లపై గోవిందా భార్య సునీత అహుజా (Sunita Ahuja) మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు. తన భర్తకు అసలు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదని ఓపెన్‌గా ఫైర్ అయ్యారు.

కూతురి వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు

Govinda: కూతురు వయసు అమ్మాయితో తిరుగుతున్నాడు సిగ్గు లేదు.. మీ షుగర్ డాడీ మంచి బట్టలూ వేసుకోలేదు: నటుడిపై భార్య కామెంట్
Govinda: కూతురు వయసు అమ్మాయితో తిరుగుతున్నాడు సిగ్గు లేదు.. మీ షుగర్ డాడీ మంచి బట్టలూ వేసుకోలేదు: నటుడిపై భార్య కామెంట్

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గోవిందా తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణితో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై కొందరు ఫొటోగ్రాఫర్లు సునీత అహుజాను ప్రశ్నించగా ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఘాటుగా స్పందించారు.

"సొంత కూతురి వయసున్న అమ్మాయిని పక్కన పెట్టుకుని తిరగడానికి కొంచెమైనా సిగ్గుండాలి.. అసలు ఆయనకు ఏమైనా పిచ్చి పట్టిందా" అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.

మీ షుగర్ డాడీ అంటూ ఘాటు కామెంట్స్

ఇక కోమల్ రాణి డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా సునీత సెటైర్లు వేశారు. "మీ షుగర్ డాడీ అంత ధనవంతుడు కదా.. కనీసం మంచి బట్టలైనా వేసుకోవచ్చుగా? మమ్మల్ని చూడండి ఎంత స్టైలిష్‌గా ఉంటామో.. అసలు వీళ్లకు ఒక స్టాండర్డ్ అంటూ లేదు" అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఆయన ఆలోచనలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సినిమా తీయకుండానే ప్రమోషన్లా?

గోవిందా తన అప్‌కమింగ్ మూవీ 'రూపా' ప్రమోషన్స్ కోసం కోమల్‌తో కలిసి తిరుగుతున్నారనే వార్తలపై సునీత ఎద్దేవా చేశారు. "ముందు సినిమా తీయాలి కదా.. ఆ తర్వాత ప్రమోషన్లు చేసుకుంటారు. అసలు సినిమా తీయకుండా ప్రమోషన్లు ఏంటి? ఇదంతా కేవలం నాటకం" అని కొట్టిపారేశారు.

ఎవరు ఈ కోమల్ రాణి స్వర్ణకార్?

ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని వేల మంది ఫాలోవర్లు ఉన్న ఈమె, గోవిందా సరసన నటిస్తుండటంతో బాలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

గోవిందా ఎఫైర్లపై సునీత సంచలన కామెంట్స్

1987లో వివాహం చేసుకున్న గోవిందా, సునీత దంపతులకు టీనా, యష్‌వర్ధన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోవిందా ఎఫైర్ల గురించి సునీత మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ షోలో నటి శిల్పా షిండే గోవిందా గురించి ప్రశ్నించినప్పుడు.. "ఆయన నా భర్త.. ఆయన 50 ఎఫైర్లు పెట్టుకున్నా మీకేంటి? వేరే వాళ్లకు మాట్లాడే హక్కు లేదు" అని ఘాటుగా సమాధానమిచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న దృశ్యాలపై నెటిజన్లు, ఫ్యాన్స్ సమాధానం చెప్పాలని సునీత సవాల్ విసురుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe