Grammy Awards 2027: 2027 గ్రామీ నామినేషన్లు.. 11 విభాగాల్లో 29 ఏళ్ల సింగర్ హవా.. బీటీఎస్ బహిష్కరణ.. భారత్‌కు నిరాశ!
Grammy Awards 2027 Nominations Full List: 69వ గ్రామీ అవార్డుల నామినేషన్ల జాబితా విడుదలైంది. బ్రిటిష్ గాయని రేయ్ ఏకంగా 11 నామినేషన్లతో బియాన్సే రికార్డును సమం చేశారు. మరోవైపు కొత్త కేటగిరీపై అసంతృప్తితో బీటీఎస్ ఈ వేడుకలకు దూరంగా ఉండగా, భారత్‌కు మాత్రం ఆ విధంగా నిరాశ ఎదురైంది.
Grammy Awards 2027 Nominations Full List: ప్రపంచ సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 గ్రామీ అవార్డుల నామినేషన్ల జాబితా బయటకు వచ్చింది. 69వ వార్షిక గ్రామీ వేడుకలకు సంబంధించి రికార్డింగ్ అకాడమీ ప్రకటించిన ఈ జాబితాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఒకవైపు యువ గాయనీమణులు దిగ్గజాలకు గట్టి పోటీనిస్తుంటే, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో వివాదాలు, భారతీయ అభిమానులకు నిరాశ మిగిల్చే అంశాలు ఇందులో ఉన్నాయి. 'నాటు నాటు' పాట ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వేదికలపై మెరిసినప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయ సంగీత అవార్డులపై ఆసక్తి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా గ్రామీ నామినేషన్లు సంగీత ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
బియాన్సే రికార్డును సమం చేసిన రేయ్
ఈ ఏడాది గ్రామీ నామినేషన్లలో 29 ఏళ్ల బ్రిటిష్ గాయని రేయ్ (Raye) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆమె రూపొందించిన 'దిస్ మ్యూజిక్ మే కంటైన్ హోప్' ఆల్బమ్‌కు ఏకంగా 11 విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. ఒకే ఏడాది అత్యధిక గ్రామీ నామినేషన్లు పొందిన మహిళా ఆర్టిస్ట్‌గా 2025లో పాప్ దిగ్గజం బియాన్సే నెలకొల్పిన రికార్డును రేయ్ సమం చేశారు.
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, రికార్డ్ ఆఫ్ ది ఇయర్, 'వేర్ ఈజ్ మై హస్బెండ్!' పాటకు గానూ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ రేయ్ చోటు దక్కించుకున్నారు. కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు 15 నామినేషన్లు పొందిన రేయ్, ఒక్కసారి కూడా గ్రామీ ట్రోఫీని ముద్దాడలేదు. ఈసారైనా ఆమె కల నెరవేరుతుందేమో చూడాలి.
టేలర్ స్విఫ్ట్ వర్సెస్ యంగ్ టాలెంట్
స్పానిష్ గాయని రోసాలియా సైతం 9 నామినేషన్లతో సత్తా చాటారు. ఇటీవలే లాటిన్ గ్రామీ అవార్డు గెలుచుకున్న ఆమె 'లక్స్' ఆల్బమ్, బ్యోర్క్, వైవ్స్ ట్యూమర్లతో కలిసి పాడిన 'బెర్గైన్' పాట ప్రధాన విభాగాల్లో పోటీపడుతున్నాయి. తొలిసారి నామినేషన్ దక్కించుకున్న కంట్రీ సింగర్ ఎల్లా లాంగ్లీ ఏకంగా 7 విభాగాల్లో నిలిచారు.
బిల్బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో 27 వారాల పాటు అగ్రస్థానంలో నిలిచిన ఆమె 'చూజిన్ టెక్సాస్' పాట సంచలనం సృష్టించింది. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో ఎల్లాతో పాటు గీస్, స్లేయీటర్, డాన్ టోలివర్ పోటీపడుతున్నారు. మిరాండా లాంబెర్ట్, ఒలివియా రోడ్రిగో, ఫోబ్ బ్రిడ్జర్స్ తలో 7 నామినేషన్లు సాధించారు.
ప్రతిష్టాత్మక 'ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే నాలుగుసార్లు ఈ అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించిన టేలర్ స్విఫ్ట్, ఈసారి 'ది లైఫ్ ఆఫ్ ఎ షోగర్ల్' ఆల్బమ్‌తో ఐదో విజయం కోసం బరిలో దిగారు. ఆమెకు రేయ్, రోసాలియా, ఎల్లా లాంగ్లీ, ఫోబ్ బ్రిడ్జర్స్, ఒలివియా డీన్, ఒలివియా రోడ్రిగో గట్టి పోటీనిస్తున్నారు. ఈ విభాగంలో 'ది రొమాంటిక్' ఆల్బమ్‌తో నామినేట్ అయిన బ్రూనో మార్స్ ఒక్కరే మేల్ సింగర్ కావడం విశేషం.
గ్రామీ వేడుకలకు బీటీఎస్ బహిష్కరణ.. జెన్నీకి చోటు
విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న దక్షిణ కొరియా బ్యాండ్ బీటీఎస్ (BTS) ఈ ఏడాది గ్రామీ అవార్డులను బహిష్కరించింది. రికార్డింగ్ అకాడమీ కొత్తగా ప్రవేశపెట్టిన 'బెస్ట్ ఆసియన్ పాప్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్' విభాగాన్ని బీటీఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాంతాల వారీగా సంగీతాన్ని విభజించడం సరికాదన్న ఉద్దేశంతో తమ పాటలను నామినేషన్లకు పంపకూడదని ఆ బృందం నిర్ణయించుకుంది.
బీటీఎస్ దూరంగా ఉన్నప్పటికీ.. ఈ కొత్త విభాగంలో ఆసియా కళాకారులు సత్తా చాటారు. బ్లాక్‌పింక్ సభ్యురాలు లిసా పాడిన 'యెస్', ఎస్బీ19 'వీసా', కీకీ '404 (న్యూ ఎరా)', బిని 'ఉనాంగ్ కిలిగ్', బేబీమెటల్-పాలీఫియా 'సన్‌సెట్ కిస్', ఐవ్ 'బ్యాంగ్ బ్యాంగ్' పాటలు ఇందులో చోటు దక్కించుకున్నాయి.
మరోవైపు బ్లాక్‌పింక్ గాయని జెన్నీ, టేమ్ ఇంపాలాతో కలిసి పాడిన 'డ్రాక్యులా' పాటకు రికార్డ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ పాప్ డుయో విభాగాల్లో రెండు నామినేషన్లు దక్కాయి. ఆగస్టులో కన్నుమూసిన దిగ్గజ కంట్రీ సింగర్ డాలీ పార్టన్‌కు మరణానంతరం మూడు నామినేషన్లు లభించాయి.
భారత్‌కు నిరాశ.. 'ధురంధర్'కు దక్కని చోటు
భారతీయ సినీ, సంగీత అభిమానులకు ఈసారి గ్రామీ జాబితా నిరాశనే మిగిల్చింది. రణ్వీర్ సింగ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ రూపొందించిన 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలోని సంగీతాన్ని బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ ఆసియన్ పాప్ సహా మొత్తం 8 విభాగాల్లో పరిశీలనకు పంపింది. భారతీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఆశించినప్పటికీ, ఈ చిత్రానికి ఒక్క విభాగంలోనూ నామినేషన్ దక్కలేదు.
వేడుక ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
గ్రామీ అవార్డుల తుది విడత ఓటింగ్ డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు జరుగుతుంది. 69వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం 2027 ఫిబ్రవరి 7న ఆదివారం లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో డాట్ కామ్ ఎరీనాలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. 1972 తర్వాత తొలిసారి ఈ వేడుక ఏబీసీ (ABC) ఛానల్లో ప్రసారం కానుంది. భారతీయ ప్రేక్షకులు డిస్నీ+, హులు ఓటీటీ వేదికల ద్వారా ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


