Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ కు ఏమైంది? జీటీఏ 6 గేమ్‌ప్లే ట్రైలర్ ధాటికి సర్వర్లు డౌన్.. ఓటీటీపై ఫ్యాన్స్ ఫైర్
Netflix OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పై ఫ్యాన్స్, సబ్ స్క్రైబర్లు ఫైర్ అవుతున్నారు. రాక్‌స్టార్ గేమ్స్ 'GTA 6' ఎక్స్‌టెండెడ్ లుక్ ట్రైలర్ విడుదలైందో లేదో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. వేలాది మంది గేమ్ ప్రియులు సోషల్ మీడియా వేదికగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Netflix OTT: వీడియో గేమింగ్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6' (GTA VI: An Extended Look) గేమ్‌ప్లే ట్రైలర్‌ను రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసింది. అయితే, ట్రైలర్ విడుదలైన మరుక్షణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గేమర్లు ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి లాగిన్ అయ్యారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు తీవ్ర ఒత్తిడికి లోనై ఒక్కసారిగా కుప్పకూలాయి.

నెట్‌ఫ్లిక్స్ డౌన్
ఆన్‌లైన్ సేవల అంతరాయాలను పర్యవేక్షించే 'డౌన్ డిటెక్టర్' (Down Detector) వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. ఈ ట్రైలర్ విడుదల కాగానే దాదాపు 4,000 మందికి పైగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్ పనిచేయడం లేదని డౌన్ డిటెక్టర్‌లో ఫిర్యాదు చేశారు. గత 24 గంటల గ్రాఫ్‌ను పరిశీలిస్తే, ట్రైలర్ విడుదలైన వెంటనే సర్వర్ల వైఫల్యం గరిష్ట స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది.
45 నిమిషాల పాటు
ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. యూజర్లు ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మళ్లీ ట్రైలర్‌ను చూడగలిగారు.
ఇవే ప్రాబ్లమ్స్
డౌన్ డిటెక్టర్ సేకరించిన సమాచారం ప్రకారం.. 33 శాతం మంది వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావడం లేదని ఫిర్యాదు చేశారు. 28 శాతం మంది సర్వర్ కనెక్షన్ లోపాలను ఎదుర్కొన్నారు. 25 శాతం మంది వీడియో స్ట్రీమింగ్ కాక మధ్యలోనే నిలిచిపోయిందని చెప్పారు.
అయితే, ఈ 45 నిమిషాల సర్వర్ల వైఫల్యంపై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్
ట్రైలర్ చూడలేకపోయిన గేమర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.
"ఇంత పెద్ద ఈవెంట్ కోసం మీరెందుకు సిద్ధంగా లేరు?" అని ప్రముఖ గేమింగ్ స్ట్రీమర్ ఐషోస్పీడ్ (IShowSpeed) నెట్‌ఫ్లిక్స్‌ను నిలదీశారు. లైవ్ స్ట్రీమ్ సమయంలో ఆయనకు కూడా నెట్‌ఫ్లిక్స్ క్రాష్ కావడం గమనార్హం.
"జిటిఎ 6 ఎక్స్‌టెండెడ్ లుక్ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ కూలిపోయింది" అని ఒక యూజర్ రాసుకొచ్చాడు.
సర్వర్లు క్రాష్
"పాపులర్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' ముగింపు ఎపిసోడ్ విడుదలైనప్పుడు కూడా నెట్‌ఫ్లిక్స్ ఇంతలా క్రాష్ అవ్వలేదు" అని మరొక నెటిజన్ పోస్ట్ చేశారు. "నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అయ్యాయి.. ఇందులో వింతేముంది?" అని ఇంకొకరు ఎద్దేవా చేశారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 32.5 కోట్లు (325 మిలియన్లు) కంటే ఎక్కువ మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇంతటి భారీ సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్నప్పటికీ, 'GTA 6' గేమ్‌ప్లే ట్రైలర్ క్రేజ్ ముందు సర్వర్లు తలవంచక తప్పలేదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


