Gunde Ninda Gudi Gantalu Balu: లక్షలు మింగినోడు వేపాకులు మింగుతున్నాడు.. మనోజ్‌కు కొత్త అవతారం వేసిన బాలు

Gunde Ninda Gudi Gantalu Balu: గుండె నిండా గుడి గంటలు సీరియల్లో తన అన్న మనోజ్ తో ఆడుకునే బాలు.. తాజాగా అతనికి ఓ కొత్త అవతారం వేశాడు. అందులో మనోజ్ కేవలం వేపాకులు నడుముకు కట్టుకొని ఓ కొత్త గెటప్ లో కనిపించాడు.

Apr 16, 2026, 14:59:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Balu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో మనకు తెలుసు. స్టార్ మాలో వచ్చే ఈ సీరియల్ టాప్ 3 లేదా 4లో కొనసాగుతూ వస్తోంది. ఈ సీరియల్లో బాలు, మనోజ్ పాత్రలు కూడా చాలా ప్రత్యేకం. ఈ అన్నదమ్ములు ఒకరిపై మరొకరు వేసుకునే పంచులు, జోకులు బాగా పేలుతాయి. తాజాగా ఈ ఇద్దరి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Gunde Ninda Gudi Gantalu Balu: లక్షలు మింగినోడు వేపాకులు మింగుతున్నాడు.. మనోజ్‌కు కొత్త అవతారం వేసిన బాలు
Gunde Ninda Gudi Gantalu Balu: లక్షలు మింగినోడు వేపాకులు మింగుతున్నాడు.. మనోజ్‌కు కొత్త అవతారం వేసిన బాలు

నడుముకు వేపాకుల గెటప్‌లో మనోజ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలు పాత్ర వేసే నటుడి పేరు విష్ణుకాంత్. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ను ట్యాగ్ చేస్తూ మరో ఇన్‌స్టా పేజ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో బాలు, మనోజ్ లను చూడొచ్చు. ఈ సీరియల్లో చాలా క్లాస్ గా, పెద్ద బిజినెస్ మ్యాన్‌లా పోజులు కొట్టే మనోజ్.. ఈ వీడియోలో మాత్రం ఒంటిపై ఏమీ లేకుండా కేవలం వేపాకులు మాత్రమే కట్టుకొని కనిపించాడు.

లక్షలు మింగినోడు ఇలా..

అతన్ని ఈ సీరియల్లో లక్షలు మింగినోడా అని తరచూ వేధించే బాలు.. ఈ వీడియోలోనూ వదల్లేదు. మా లక్షలు మింగినోడు.. ఇప్పుడు వేపాకులు మింగినోడిగా మారిపోయాడు.. ఏంట్రా ఈ అవతారం అని అంటాడు.

దీనికి మనోజ్ స్పందిస్తూ.. నన్ను కాదు.. అమ్మ వస్తుంది.. ఆమె అవతారం చూస్తే షాక్ తింటావు అని అంటాడు. అక్కడితో ఆ వీడియో ముగుస్తుంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్లో రాబోతోంది అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఆ పేజ్ పోస్ట్ చేసింది. దీంతో రానున్న ఎపిసోడ్లలో మనోజ్ ఇలా కనిపించనున్నాడా అనే ఆసక్తి రేగుతోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ విశేషాలు

సత్యం, ప్రభావతి.. వాళ్ల ముగ్గురు కొడుకులు, కోడళ్ల చుట్టూ తిరిగే సీరియల్ ఇది. తన పెద్ద కొడుకుపై ప్రేమ కురిపించే ప్రభావతి.. రెండో కొడుకైన బాలుని మాత్రం సవతి కొడుకులా చూస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్లో తల్లి వల్ల బాలు రూ.5 లక్షలు అప్పు చేయాల్సి రావడం.. ఇందులో తను, తన భార్య చేసిన తప్పేమీ లేకపోవడంతో ఆ డబ్బును తల్లితోనే వసూలు చేయాలని బాలు చూస్తాడు.

ఆమె కోసం సత్యం ఉద్యోగం చేయడం మొదలుపెడతాడు. అయితే తండ్రి కష్టం చూడలేక తానే ఓ ఉద్యోగం పేరుతో సత్యం ఫ్రెండ్ రంగా ద్వారా డబ్బు ఇప్పిస్తాడు బాలు. అది తెలిసి సత్యం ఎమోషనల్ అవుతాడు. అటు ప్రభావతి మాత్రం తనను అవసరంలో ఆదుకోని తన ముద్దుల కొడుకు మనోజ్ ను చితగ్గొడుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ రోజుకో మలుపుతో ఆసక్తికరంగా సాగుతోంది. మరి రానున్న రోజుల్లో మరెన్ని ట్విస్టులు వస్తాయో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More