...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: నిజం కక్కేసిన కామాక్షి.. ఇంట్లో ప్రభావతి గుట్టు విప్పిన మీనా.. రోహిణి ఖేల్ ఖతం!

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో మీనాను బాలు కాపాడుకుంటాడు. అదే సమయంలో కామాక్షి దగ్గరికి వెళ్లి నిలదీయడంతో ఆమె అసలు నిజం కక్కేస్తుంది. ప్రభావతి దొరికిపోతుంది.

Published on: Apr 13, 2026, 07:54:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాపై ప్రభావతి వేసిన దొంగతనం ముద్ర బెడిసి కొడుతుంది. చివరికి తానే అడ్డంగా ఇరుక్కుంటుంది. మీనా తిరిగి ఇంటికి రావడం, ఆ డబ్బు గుట్టు విప్పడంతో భయంతో రోహిణి బిక్కచచ్చిపోతుంది.

మీనా కిడ్నాప్ అయిందని బాలుకి చెప్పిన అవ్వ, తాత

Gunde Ninda Gudi Gantalu Today Episode: నిజం కక్కేసిన కామాక్షి.. ఇంట్లో ప్రభావతి గుట్టు విప్పిన మీనా.. రోహిణి ఖేల్ ఖతం!
Gunde Ninda Gudi Gantalu Today Episode: నిజం కక్కేసిన కామాక్షి.. ఇంట్లో ప్రభావతి గుట్టు విప్పిన మీనా.. రోహిణి ఖేల్ ఖతం!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (ఏప్రిల్ 13) ఎపిసోడ్ మీనా కోసం బాలు వెతికే సీన్ తో మొదలవుతుంది. వెతుక్కుంటూ వెళ్తూ చివరికి ఆ అవ్వ, తాత దగ్గరికి వస్తాడు. మీనాను ఎవరో ఎత్తుకెళ్లిపోయారంటూ వాళ్లు చూసింది చెబుతారు. కారు నంబరు గుర్తు లేదు కానీ.. కారు వెనుక ఓ గుర్తు ఉందంటూ ఆనవాళ్లు వెల్లడిస్తారు. దీంతో బాలు ఆ కారు ఆనవాళ్ల గురించి తన డ్రైవర్ల గ్రూపులో చెబుతాడు.

దినేష్‌ ముఖం చూసిన మీనా

ఇటు మీనా దగ్గర ముసుగు వేసుకొని దినేష్ వస్తాడు. నువ్వు ఎవరు అని అడిగినా అతడు చెప్పడు. తనకు నీళ్లు కావాలని ఆమె అడగడంతో మొదట మొండికేసినా తర్వాత తెచ్చిస్తాడు. ఆ నీళ్లు తాగి అతని ముఖాన ఊస్తుంది. దీంతో దినేష్ ముసుగు తీస్తాడు. అప్పుడు మీనా అతన్ని చూస్తుంది. నువ్వా అంటూ నిలదీస్తుంది.

మా ఆయన వస్తే ఈసారి నీ అంతు చూస్తాడని బెదిరిస్తుంది. వాడు రావాలి కదా.. గంట టైమ్ ఇస్తున్నాను.. వాడు రాకపోతే నీ వేళ్లు కత్తిరించి వాడికి పార్శిల్ చేస్తానని దినేష్ బెదిరించి వెళ్లిపోతాడు. తన మనిషిని పిలిచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పడంతో అతడు ఆ కిడ్నాప్ చేసిన కారులోనే బయటకు వెళ్తాడు.

బాలుకి సాయం చేయడానికి తరలి వచ్చిన డ్రైవర్లు

దీంతో బాలు వెంటనే అక్కడికి వెళ్తాడు. గుడి చుట్టూ చూస్తాడు. ఎక్కడా మీనా జాడ కనిపించదు. కానీ ఆమె కట్టుకున్న చీర ముక్క ఒకటి అక్కడ కనిపిస్తుంది. దీంతో బాలు భయం పెరుగుతుంది. ఆమె ప్రమాదంలో ఉందని రాజేష్ తో అంటాడు. ఆ పక్కనే ఉన్న మీనా.. బాలుని చూసినా అతడు మాత్రం ఆమెను చూడడు. మరోవైపు మీనా ఇక్కడే ఉండొచ్చు వెతుకుదామంటూ రాజేష్ వెళ్తాడు. ఇంతలో అతనికి ఆ కారు కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ వెళ్తాడు.

బాలు నుంచి తప్పించుకున్న దినేష్

చివరికి మీనాను దాచిన చోటికి బాలు, రాజేష్, ఇతర డ్రైవర్లందరూ వస్తారు. గంట టైమ్ పూర్తయిందంటూ మీనా వేళ్లు కత్తిరించడానికి దినేష్ సిద్ధమవుతాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్లంతా రావడంతో భయంతో గుణకి ఫోన్ చేస్తాడు. అతడు వెనుక నుంచి వచ్చి దినేష్ ను తీసుకెళ్లిపోతాడు.

ఇటు మీనాను బాలు, రాజేష్ రక్షిస్తారు. అయితే దినేష్ ను మాత్రం పట్టుకోలేకపోతారు. తనను కిడ్నాప్ చేసింది ఆ దినేషే అని, అతనికి మనపై చాలా పగ ఉన్నట్లుందని, మీరు రావడం నిమిషం ఆలస్యమైనా అతడు తన చేతి వేళ్లను కట్ చేసేవాడని అంటుంది.

కామాక్షి దగ్గరికి బాలు, మీనా.. పోలీసులంటూ భయపెట్టి..

మీనా క్షేమంగా బయటపడటంతో ఇక ఆ రూ.2 లక్షల గుట్టు విప్పేందుకు కామాక్షి దగ్గరికి వెళ్తారు బాలు, మీనా. నాపై ఎందుకు దొంగతనం నింద వేశారు.. నేను తీయడం మీరు చూశారా అంటూ కామాక్షిని మీనా నిలదీస్తుంది.

అటు బాలు కూడా డబ్బు మీ ఇంట్లో పోతే నువ్వు సైలెంట్ గా ఉన్నావు కానీ.. మా అమ్మ ఎందుకు రాద్ధాంతం చేస్తోంది.. మీనాను ఎందుకు దొంగను చేస్తోంది అని కామాక్షిని అడుగుతాడు. కానీ ఆమె నిజం చెప్పదు. దీంతో పోలీసుల దగ్గరికి వెళ్దాం వాళ్లే అసలు నిజం బయటపెడతారని మీనా, బాలు భయపెడతారు.

అసలు నిజం చెప్పేసిన కామాక్షి

అటు తిరిగి ఇటు తిరిగి నేరం తనపైకి ఎక్కడ వస్తుందో అని కామాక్షి టెన్షన్ పడుతుంది. బాలు, మీనా పదే పదే అడగడంతో ఇక చేసేది లేక ఆ డబ్బు తనది కాదని అంటుంది. ఆ డబ్బు మీ అమ్మదే.. మీనా తమ్ముడిపై ఉన్న కేసును వాపసు తీసుకోవడానికి ఆ లాయర్ ఇచ్చాడు అని అసలు నిజం కక్కేస్తుంది.

ఏదో పెద్ద త్యాగం చేసినట్లు మాట్లాడింది.. అసలు విషయం ఇదా అని అని బాలు అంటాడు. ఇంటికి వెళ్లి ఆమె సంగతి తేలుస్తా అంటూ బాలు, మీనా ఆవేశంగా వెళ్లిపోతారు. కామాక్షి చేసిన పనీ బయటపెడతామనడంతో ఆమె టెన్షన్ పడుతుంది.

సత్యం ముందు ప్రభావతి పరువు తీసిన మీనా

ఇంటికి రాగానే మీనాను ఏదో అడగడానికి వెళ్తుంది ప్రభావతి. కానీ అంతకంటే ముందే మీనా చెలరేగిపోతుంది. సత్యంతోపాటు మనోజ్, రోహిణి, రవి, శృతి ముందే ప్రభావతిని కడిగి పారేస్తుంది. ఆ డబ్బు మీదే అని తెలిసిపోయింది.. మీ దగ్గరికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీనా, బాలు ఆమెను నిలదీస్తారు.

దీంతో ప్రభావతి షాక్ తింటుంది. మీనా తిరిగి రావడం, ఆ డబ్బు గురించి తెలుసుకోవడంతో రోహిణి బిక్కచచ్చిపోతుంది. ప్రభావతి తర్వాత తన వంతే అని బెదిరిపోతుంది. అటు సత్యం కూడా ఆ డబ్బు ఎక్కడిది అని ప్రభావతిని నిలదీస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe