...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి స్కెచ్.. సింగరాజు దగ్గరికి మీనా.. మౌనికకు రాఖీ కష్టాలు

Gunde Ninda Gudi Gantalu Serial August 29th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 29 ఎపిసోడ్ లో మీనాకు ఆర్డర్ రాకుండా అడ్డుకునేందుకు ప్రభావతి, చింతామణి కలిసి ప్లాన్ చేస్తారు. అటు అన్నలకు రాఖీ కట్టాలని ఆశపడిన మౌనికకు సంజూ వార్నింగ్ ఇస్తాడు.

Published on: Aug 29, 2026, 07:03:55 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా ఎదురు మాట్లాడటాన్ని సహించలేకపోయిన ప్రభావతి.. ఆమెను అడ్డుకునేందుకు చింతామణితో కలిసి ప్లాన్ చేస్తుంది. మరోవైపు చాలా రోజుల తర్వాత రాఖీ ఎపిసోడ్ తో మౌనిక ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇది మళ్లీ బాలు, సంజూ మధ్య గొడవకు దారి తీసేలా కనిపిస్తోంది.

ప్రభావతితో ఆడుకున్న మీనా, శృతి.. మెచ్చుకున్న బాలు..

Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి స్కెచ్.. సింగరాజు దగ్గరికి మీనా.. మౌనికకు రాఖీ కష్టాలు
Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి స్కెచ్.. సింగరాజు దగ్గరికి మీనా.. మౌనికకు రాఖీ కష్టాలు

తనకు ఎదురు తిరిగి మాట్లాడుతూ బామ్మ పొలం అమ్ముకుంటానన్న మీనాకు ప్రభావతి వార్నింగ్ ఇచ్చే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 29) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే శృతి కూడా వచ్చి మీనాకు సపోర్ట్ చేస్తుంది. మీనా ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు కదా.. నాలుగు గోడల మధ్య పిల్లి కూడా పులిలా మారుతుందన్నది తెలియదా అని ప్రభావతిని మరింత ఉడికిస్తుంది.

దీంతో ప్రభావతి ఆవేశంతో ఊగిపోతూ వెళ్లిపోతుంది. మధ్యలో బాలు కలిస్తే అతన్ని కూడా తిట్టి నీ పెళ్లానికి కొమ్ములొచ్చాయని చెప్పి వెళ్తుంది. దీంతో మీనా దగ్గరికి వచ్చిన బాలు.. అమ్మను ఎదిరించి మాట్లాడావా అంటూ మెచ్చుకుంటాడు. అంతేకాదు బామ్మ పొలం అమ్ముకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చింది అని శృతి చెబుతుంది.

సింగరాజు దగ్గరికి వెళ్తానన్న మీనా

అవునా అయితే వెంటనే శీలా డార్లింగ్ కు ఫోన్ చేస్తాను అని బాలు అంటాడు. మనం అడిగితే ఆమె వెంటనే పొలం అమ్మకానికి పెడుతుంది అని చెబుతాడు. దీంతో మీనా వద్దని వారిస్తుంది. నేనేదో ఊరికే అత్తయ్యకు అలా చెప్పాను కానీ.. పెద్దల నుంచి ఆశీస్సులు ఆశించాలి.. ఆస్తులు కాదు అని ఓ సెంటిమెంట్ డైలాగ్ చెప్పడంతో ఇలాంటివన్నీ నీకే ఎందుకు వస్తాయి మీనా అని శృతి అడుగుతుంది.

ఇటు ఆవేశంతో ఊగిపోతూ కామాక్షి ఇంటికి వెళ్తుంది ప్రభావతి. మీనా అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పుడే కామాక్షి వచ్చి స్వీట్ ఇచ్చినా తీసుకోదు. గొడ్డు కారం తినాలన్నంత ఆవేశంతో వస్తోందంటూ మీనా గురించి చెబుతుంది. స్వీటు అవసరం లేకపోతే తీయని మాటలు చెప్పి గోతులు తీసే చింతామణి వస్తుంది.. ఆమెతో మాట్లాడు అని కామాక్షి అంటుండగానే ఆమె ఎంట్రీ ఇస్తుంది.

చింతామణితో మీనాను అడ్డుకునే ప్లాన్

చింతామణి రాగానే మీనాకు వచ్చిన ఆర్డర్ గురించి ప్రభావతి చెబుతుంది. ఈ ఆర్డర్ ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని, అది ఎదుగుతున్న కొద్దీ నాకు విలువ లేకుండా పోతుందని ప్రభావతి అంటుంది. ఈ ఆర్డర్ కోసం ఇంటిపై డబ్బు తీసుకుంటానంటే వద్దన్నాను.. ఇప్పుడది పొలం అమ్మడానికి ప్లాన్ చేస్తోంది.. బాలు, మీనా అడిగితే మా అత్తయ్య క్షణం కూడా ఆలోచించకుండా అమ్మేస్తుంది.. అదే జరిగితే మిగితా వాళ్ల నోళ్లలో మట్టి పడుతుంది అని ప్రభావతి అంటుంది. అందుకే ఈ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి రాకూడదు.. మీనా మళ్లీ పూలు అమ్ముకుంటూ ఉన్నా సరే అని స్పష్టం చేస్తుంది.

మూడు రోజుల్లో పొలం అమ్మడం కుదరదు.. అది జరగకపోతే మీనా దగ్గర డబ్బు ఉండదు.. ఇక ఆర్డర్ వచ్చే ఛాన్సే లేదు కదా అని చింతామణి అంటుంది. అది విని రెండు గుంటనక్కలు మంచి చీరలు కట్టుకొని మాట్లాడుతున్నట్లుగా ఉంది అని కామాక్షి వాళ్లను ఉద్దేశించి అంటుంది. కచ్చితంగా ఈ ఆర్డర్ మీనాకు వస్తుంది.. అలా వచ్చేలా బాలు చేస్తాడు.. వాడు అనుకుంటే చింతామణి కాదు ఏ మణీ అడ్డుకోలేదు అని గట్టిగా చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ప్రభావతి, చింతామణి షాక్ తింటారు. అయినా ఆర్డర్ రాకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తారు.

మౌనిక కోసం బాలు కొత్త చీర.. ఆట పట్టించిన మీనా

ఇటు ఇంటికి బాలు ఓ కొత్త చీరతో వస్తాడు. అప్పటికే మీనా తమ్ముడు శివకు రాఖీ కట్టడానికి వెళ్తూ ఏ చీర కట్టుకోవాలా అని చూస్తుంటుంది. బాలు కొత్త చీర చూపించగానే అది తనకే అనుకొని చాలా బాగుంది.. ఇప్పుడే ఏ చీర కట్టుకోవాలా అని చూస్తున్నాను.. భార్య అడగకుండానే చీర తెచ్చారు.. మీరు చాలా గ్రేట్ అని అంటుంది. దీంతో బాలు ఇబ్బంది పెడతాడు. నిజానికి అది మౌనిక కోసం తెచ్చిన చీర.. ఆ కలర్ ఆమెకు చాలా ఇష్టం అని అంటాడు.

అవునా.. కానీ ఈ చీర నాకు బాగా నచ్చింది అని మీనా అనడంతో సరే అలాంటిదే మరో చీర ఉంటే మౌనిక కోసం మరొకటి తీసుకొస్తాను.. ఇది నచ్చితే నువ్వే తీసుకో అని డల్లుగా చెబుతాడు బాలు. దీంతో మీనా నవ్వుతూ.. ఈ కలర్ చూడగానే మౌనిక కోసమే తీసుకొచ్చారని తెలుసు.. కావాలనే ఆట పట్టించానని అనడంతో బాలు కూడా నవ్వి వెళ్లిపోతాడు. కానీ రాఖీ కట్టడానికి వాళ్ల ఆయన పంపిస్తాడా అని మీనా అనుకుంటుంది.

అన్నల కోసం మౌనిక రాఖీలు.. సంజూ వార్నింగ్

అటు మౌనిక తన అన్నల కోసం రాఖీలు ఆన్‌లైన్ లో ఆర్డర్ ఇస్తుంది. అవి ఇంటికి వస్తాయి. వాటిని తీసుకోగానే సంజూ పైనుంచి కిందికి వస్తుంటాడు. అవేంటని అడిగితే.. శ్రావణ శుక్రవారం పూజ కోసం తెప్పించిన సామాగ్రి అని చెబుతుంది. వాటిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లడంతో సంజూకి అనుమానం వస్తుంది. మౌనికకు ఏదో పని అప్పజెప్పి.. తాను బెడ్ రూమ్ లోకి వెళ్లి వెతుకుతాడు. అతనికి రాఖీలు కనిపిస్తాయి. దీంతో మౌనికను నిలదీస్తాడు. మీ అన్నల్లో ఒకడికి సమాధి కడదామని చూస్తుంటే.. నువ్వు వెళ్లి రాఖీ కడతావా.. వీల్లేదు అని స్పష్టం చేస్తాడు.

అటు తన చెల్లి రేపు రాఖీ కట్టడానికి వస్తుందని బాలు ఆశతో ఉంటాడు. మీనాతోనూ అదే చెబుతాడు. వాళ్ల ఆయన పంపిస్తాడా అని మీనా అంటే..ఓ అన్నకు చెల్లి రాఖీ కట్టకుండా ఈ శక్తీ అడ్డుకోలేదు అని బాలు అంటాడు. అటు రాఖీలు తీసుకొని సంజూ చెత్తబుట్టలో పారేస్తాడు. మౌనిక ఏడుస్తూ ఉంటుంది. ఇది రాఖీలు కట్టడానికి వెళ్తే ఈ ఇంట్లో దీనికి రేపే చివరి రోజు అని సంజూ తన తల్లితో తేల్చి చెబుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks