Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్‌కు రోహిణి లిప్ కిస్ పెట్టిందని ప్రభావతి రచ్చ చేస్తుంది. అమ్మా అలాంటిదేం లేదు. కంట్లో నలక పడిందని మనోజ్ చెబుతాడు. ఈ మలేషియా మంత్రగత్తె నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేట్టులేదు. నా కొడుకు దూరంగా ఉండమంటే వినట్లేదు. చాటుగా మందు పెట్టాలని చూస్తుంది అని ప్రభావతి అంటుంది.
రోహిణికి పిల్లలు పుట్టడం ఇష్టం లేదన్న ప్రభావతి

ఇప్పటివరకు వాడితో ఆడుకుంది చాలు అని రోహిణి చేసిన వాటన్నింటిని చెబుతుంది ప్రభావతి. ఆస్తులున్నాయని మోసం చేసిందంటుంది. ఇది గాలికి పుట్టి గాలికి పెరిగింది. దీని కడుపున మన వంశం పడటం నాకు ఇష్టం లేదు అని ప్రభావతి అంటుంది. ఇది చాలా పెద్ద క్రైమ్. రోహిణి తన భర్త నుంచి వేరు చేస్తున్నారని కేసు పెడితే ఏమవుతుందో తెలుసా అని శ్రుతి అంటుంది.
దాంతో బాలు చిప్పకూడు తినాలా అని భయపెడతాడు. ఇప్పుడు నేనేం ఆస్తుల కోసం ఆరాటపడట్లేదు అని ప్రభావతి అంటుంది. వాళ్లు కలిసిపోవాలనే నేనే వంటింట్లో టిఫిన్ పెట్టాను మావయ్య అని మీనా అంటుంది. నీ మొఖం మండినట్లే ఉంది. ఒకసారి దీని చేతిలో మోసపోయింది చాలు అని ప్రభావతి అంటుంది. నా కంట్లో నలుక ఎవరు తీస్తారని మనోజ్ అంటే.. బాలు వెళ్లి నలుగురు అమ్మాయిలను తీసుకొస్తాడు బాలు.
వాడి కంట్లో నలక తీయడానికి నలుగురిని తీసుకొచ్చానని బాలు అంటాడు. రండి రండి తీయండి. నాకు రోజు కంట్లో నలక పడుతుంటుంది అని మనోజ్ సంతోషంగా అంటాడు. రోజు వస్తారు. ఒక్కొక్కరికి 250 రూపాయలు. నలుగురికి వెయ్యి రూపాయలు అని బాలు చెబుతాడు. రేయ్ ఏంట్రా ఇది అని సత్యం అంటే.. ఊరికే నాన్న అని బాలు సైగ చేస్తాడు.
మనోజ్‌కు నలుగురు ముద్దుపెట్టినట్లు
అయ్యగారికి నలక తీయండని బాలు అంటాడు. దాంతో నలుగురు మనోజ్‌ను ముద్దుపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అది చూసిన ప్రభావతి అందరిని చీపురు కట్టతో కొట్టి తరిమేస్తుంది. మరోవైపు సంజును పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని, నువ్వు ఏం చేసిన సమాజం కోసం చేసినట్లు ఉండాలని, అప్పుడే పార్టీలో మంచి పొజిషన్ వస్తుంది అని తండ్రి నీలకంఠం అంటాడు.
{{/usCountry}}అయ్యగారికి నలక తీయండని బాలు అంటాడు. దాంతో నలుగురు మనోజ్‌ను ముద్దుపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అది చూసిన ప్రభావతి అందరిని చీపురు కట్టతో కొట్టి తరిమేస్తుంది. మరోవైపు సంజును పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని, నువ్వు ఏం చేసిన సమాజం కోసం చేసినట్లు ఉండాలని, అప్పుడే పార్టీలో మంచి పొజిషన్ వస్తుంది అని తండ్రి నీలకంఠం అంటాడు.
{{/usCountry}}క్యాలెండర్‌లో వచ్చే ప్రతి పండుగను మనం క్యాష్ చేసుకోవాలి. ఇవాళ రాఖీ పండుగ. నీకు రాఖీలు కట్టేందుకు మహిళా కార్యకర్తలు వస్తారు. వాళ్లలో అక్కాచెల్లెళ్లను చూసుకోవాలి. వాళ్ల మీద ప్రేమ చూపించాలి. వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అదంతా షూట్ చేసేందుకు డైరెక్టర్ కూడా వస్తున్నాడు అని నీలకంఠం అంటాడు.
సరేనని సంజు వెళ్లిపోతాడు. అది చూసిన సువర్ణ మౌనికకు చెబుతుంది. వెంటనే వెళ్లి మీ అన్నయ్యలకు రాఖీలు కట్టమంటుంది సువర్ణ. రాఖీలతో మౌనిక బయటకు రాగానే సంజు ఎదురుపడి చూస్తాడు. కోపంగా రగిలిపోతాడు. ఎంత ధైర్యముంటే నా మాట కాదని ఇంటి గడప దాటుతావ్ అని మౌనికను ఇంట్లోకి లాక్కెళ్తాడు సంజు. తల్లి తిడుతుంది.
రాఖీలు కట్టే తీరిక ఉంటుందా
భార్యాభర్తల మధ్య నీకేంటీ పని.. వెళ్లు అని నీలకంఠం అంటాడు. మా అన్నయ్య వచ్చి రాఖీ కట్టించుకుంటాడని మౌనిక అంటుంది. అంత ధైర్యముందా నేను చూస్తానని సంజు అంటాడు. ఆ బాలు గాడు వస్తాడంట. ఏం చేద్దామని సంజు అంటే.. రాని వాడికి బాగా అవమానం చేద్దాం అని నీలకంఠం అంటాడు. బాలు, సత్యంకు కాఫీ ఇస్తుంది మీనా.
ప్రభావతి వచ్చి తనకు కూడా కాఫీ కావాలని అరుస్తుంది. నువ్వే వెళ్లి తెచ్చుకో అని బాలు అంటాడు. మనోజ్, రవి వస్తారు. ఎవరికి రాఖీ పండుగ గుర్తుండదు. రాఖీ పౌర్ణమి అని మీనా చెబుతుంది. ఇవాళ మౌనిక వస్తుందని బాలు అంటాడు. అది రాదు అని ప్రభావతి అంటుంది. వాళ్లది పెద్ద రాజకీయాల కుటుంబం. రాఖీలు కట్టేంత తీరిక ఉంటుందా అని ప్రభావతి అంటుంది.
ఒక్కరోజే కదా. ఇవాళ వర్క్స్ మ్యానేజ్ చేసుకుందాం అని శ్రుతి అంటుంది. నాకు మౌనిక గురించి తెలుసు గుర్తుపెట్టుకుని రాఖీలు కడుతుంది. మౌనిక వస్తుంది. అప్పటివరకు ఎవరైనా బయటకు వెళ్తే నేనే కాళ్లు విరగ్గొడతాను అని సత్యం అంటాడు. దాంతో బాలు విజిల్ కొడతాడు. మోసాల గురించి బాలు టాపిక్ తీస్తాడు.
మౌనికతో బాలుకు అవమానం
ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగితే అంటారా అని రోహిణి రివర్స్ అవుతుంది. మా అమ్మ పడేసి కొట్టింది మర్చిపోయావా. వినరాని మాటలు అంది. మోసం చేసేటప్పుడు తెలియదా దొరికిపోతే ఏమవుతుందో అని రోహిణికి కౌంటర్స్ ఇస్తాడు బాలు. తర్వాత మౌనిక రాకపోయేసరికి సంజు ఇంటికి మనోజ్, రవిని తీసుకుని వెళ్తాడు బాలు.
బాలును అవమానించేందుకు ఇంట్లోకి రానివ్వరు సంజు, నీలకంఠం. దాంతో బాలు అక్కడే ఇంటి ముందు ధర్నా చేస్తాడు. గేట్ దగ్గర కూర్చుంటాడు. ఇలా చూడలేకపోతున్నానని రవి అంటే.. బాలుని మాత్రం రానివ్వం. ఇలాగే గేట్ దగ్గర కడతానంటే కట్టించుకోమ్మను అని నీలకంఠం అంటాడు. మౌనిక వస్తుంది.
రాఖీ కడితే యావజ్జీవ శిక్ష పడేలా చేస్తా
అమ్మా నువ్వు రాఖీ కడితే నీకు ఇచ్చేందుకు నీకు ఇష్టమైన కలర్ చీర తీసుకొచ్చానని చూపిస్తాడు బాలు. నువ్వు వాడికి రాఖీ కడితే యావజ్జీవ శిక్ష పడేలా చేస్తానని సంజు బెదిరించింది మౌనిక గుర్తు చేసుకుంటుంది. బాలును మౌనిక అవమానించి పంపించేలా చేసినట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.