Gunde Ninda Gudi Gantalu Serial: మీనాను గట్టి దెబ్బే కొట్టిన చింతామణి.. కొంప ముంచిన సంతకం.. రూ.10 లక్షలు లాస్!
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 14 ఎపిసోడ్ లో మీనాను చింతామణి గట్టి దెబ్బే కొట్టబోతోంది. తన మనిషితో రూ.10 లక్షల ఆర్డర్ అంటూ ఆమెకు ఆశ చూపి పేపర్లపై సంతకాలు చేయిస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial: స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మీనా పాత్రకు మరో పెద్ద కష్టమే రాబోతున్నట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఆమె అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న చింతామణి.. మీనాను పెద్ద ఆర్డర్ పేరుతో ఇరికించాలని గట్టి ప్లానే వేసింది.

మీనాకు రూ.10 లక్షల ఆర్డర్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. పూల డెకరేషన్ లలో వరుస ఆర్డర్లు సంపాదిస్తూ ఆ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఉన్న చింతామణికి మీనా షాకిస్తున్న సంగతి తెలుసు కదా. మీనాను ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసినా కుదరదు. దీంతో ఆమెను ఇరికించడానికి ఓ పెద్ద ప్లానే చేస్తుంది.
ఈ క్రమంలో మీనాకు ఓ పెద్ద ఆర్డర్ వస్తుంది. ఓ వ్యక్తిని ఆమెను రమ్మని పిలుస్తాడు. మీ గత డెకరేషన్లు చూశాను.. చాలా బాగున్నాయి.. ఓ పెద్ద ఆర్డర్ ఉంది.. దాని విలువ రూ.10 లక్షలు చేయగలవా అని అడుగుతాడు. మీనా వెంటనే సరే అంటుంది.
అమాయకంగా సంతకం చేసి..
అయితే పెద్ద ఆర్డర్ కావడంతో అగ్రీమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుందని ఆ వ్యక్తి కొన్ని పేపర్లు ఆమె ముందు పెడతాడు. అవన్నీ ఇంగ్లీషులో ఉండటంతో ఆమె చదవడానికి ఇబ్బంది పడుతుంది. తర్వాత సంతకం చేస్తానని అంటే.. ఇప్పుడు చేయాలని, లేదంటే ఆర్డర్ పోతుందని ఆ వ్యక్తి అంటాడు. దీంతో మీనా మరో దారి లేక సంతకం చేసేస్తుంది.
బాలు ఎగిరి గంతేసి..
మీనా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తుంది. బాలుకి ఈ విషయం చెబుతుంది. తనకు ఏకంగా రూ.10 లక్షల ఆర్డర్ వచ్చిందని అంటుంది. దీంతో అతడు ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు. ఈ ఆర్డర్ తో తమ జీవితం ఇక మారిపోయినట్లే అన్న ఆనందం వాళ్లలో కనిపిస్తుంది.
చింతామణి ట్రాప్‌లో మీనా
అయితే ఇదంతా చింతామణి ట్రాప్ అని తర్వాత తెలుస్తుంది. మీనాకు ఆ కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ కాంట్రాక్ట్ ఆమెకు ఇచ్చావా అని అడుగుతుంది. మీరు చెప్పినట్లే చేశానని అతడు చెబుతాడు. మీనాను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూస్తూ ఉండు అని చింతామణి అంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
మీనాకు భారీ నష్టం తప్పదా?
ఈ ప్రోమోను చూస్తుంటే.. మీనాను ఇరికించడానికి చింతామణి ఏదో పెద్ద ప్లానే వేసినట్లు స్పష్టమవుతోంది. ఆ అగ్రీమెంట్ లో ఏముందో చదవకుండానే మీనా సంతకం పెట్టేయడం చూస్తుంటే.. అందులో ఏదో మెలిక ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పాయింట్ తోనే మీనాను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని చింతామణి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ గండం నుంచి ఆమె బయటపడుతుందా? లేక మీనా, బాలుకు మరో పెద్ద ముప్పే రాబోతోందా అన్నది ఈ సీరియల్ నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


